ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూ నివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య మాట్లాడుతూ ఈ నెల 15 కంటే ముందుగానే వీసీలను ని యమించి, వర్సిటీల అభివృద్ధికి తగిన చర్య లు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం మా టతప్పిందని ధ్వజమెత్తారు. ఇన్చార్జి వీసీలతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించా రు.
వీసీల నియామకానికి ఏర్పాటుచేసిన సె ర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటేనే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందని దుయ్యబట్టా రు. తక్షణమే వీసీలను నియమించకపోతే దశలవారీగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. నాయకులు నరేశ్, అశ్వన్, రాఘవేందర్, రమేశ్, సంతోష్, వరుణ్ పాల్గొన్నారు.