Alekhya Tarakratna | నందమూరి కుటుంబానికి చెందిన నటుడు నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత భార్య అలేఖ్య రెడ్డి ఎక్కువగా బయటకు రాకుండా తన పిల్లలతోనే సమయం గడుపుతూ ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న జ్ఞాపకాలను, పిల్లల గురించి పోస్టులు చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది. అయితే తాజాగా ఆమె మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా తారకరత్నతో తన పరిచయం ఎలా మొదలైందో అలేఖ్య వివరించింది. హైదరాబాద్లోనే మొదటిసారి తారకరత్నను కలిసినట్లు ఆమె తెలిపింది. మొదట ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని, తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారిందని చెప్పింది.
ప్పటికే తాను మొదటి వివాహం నుంచి విడాకులు తీసుకున్నానని, ఇక మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని తెలిపింది. అయితే తారకరత్న తనను నమ్మబలికి పెళ్లికి ఒప్పించాడని చెప్పింది. తన తండ్రికి తారకరత్న ముందే పరిచయం ఉందని, అందుకే తానే వెళ్లి తన తల్లిదండ్రులతో మాట్లాడాలని కోరానని అలేఖ్య తెలిపింది. మొదట్లో వారు అంగీకరించకపోయినా నెల రోజులకు తర్వాత ఒప్పుకున్నారని వెల్లడించింది. అయితే తమ పెళ్లికి తారకరత్న కుటుంబం నుంచి మాత్రం అంగీకరించకపోవడం బాధగా ఉందని ఆమె చెప్పింది. అయితే తాను మాత్రం తారకరత్న తల్లిదండ్రులను ఎప్పుడూ మామయ్య, అత్తయ్యలుగానే భావించానని తెలిపింది. కానీ ఇప్పటికీ వారు తనను పూర్తిగా అంగీకరించలేదని చెప్పింది. పెద్దవాళ్లు కావడంతో తమపై కోపం ఉండొచ్చని, కానీ ఒకరోజు అయినా పిల్లలను దగ్గరకు తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆమె భావోద్వేగంగా పేర్కొంది.
ఇప్పటివరకు చాలా సార్లు వారితో దగ్గరవ్వడానికి ప్రయత్నించానని, కానీ ప్రస్తుతం తారకరత్న కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని అలేఖ్య తెలిపింది. ఒకప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ స్నేహితుడిలా ఉండేవాడని కూడా చెప్పింది. అయితే తమ గురించి తెలుసుకుంటూ ఉండే వ్యక్తి మాత్రం నందమూరి బాలకృష్ణ మాత్రమేనని వెల్లడించింది. తన దగ్గర ఉన్నదాంట్లోనే పిల్లలను పెంచగలనని, కానీ తారకరత్న తల్లిదండ్రులు కూడా మనవళ్లను దగ్గరకు తీసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని అలేఖ్య చెప్పింది. “పిల్లలను ఒక్కసారి అయినా దగ్గరకు తీసుకుంటే చాలు… అదే నా కోరిక” అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ ఇంటర్వ్యూలో అలేఖ్య చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారకరత్నను అభిమానించే వారు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.