Khammam Police | వెలుగుమట్ల బాధితులకు భోజనం పెట్టకుండా అడ్డుకుని పోలీసుల అత్యుత్సాహం.. వీడియో
Khammam Police | వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటం గమనార్హం. ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న భోజనాల వాహనాన్ని అడ్డుకున్నారు.
Khammam Police | ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా బోజన సౌకర్యాలు అందిస్తున్నారని తెలిసిందే. నిలువ నీడ కోల్పోయిన బాధితులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో పువ్వాడ ఫౌండేషన్ భోజనం సౌకర్యం కల్పించడం కాంగ్రెస్ సర్కార్‌కు, పోలీసులకు మింగుడు పడటం లేదు.
వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటం గమనార్హం. ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న భోజనాల వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు తమకు ఆకలేస్తుందని భోజనాలను పంపాలని మహిళలు, బాధితులు పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. అయితే అవేం పట్టించుకోకుండా
రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భోజనాలు అందిస్తామని , బయట వ్యక్తులు భోజనం పెడితే తినొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. మరి ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన తమకు ఇన్ని రోజులుగా భోజనాలను ఎందుకు అందించలేదని బాధితులు పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరోవైపు బాధితుల ఆకలి చూసిన బీఆర్ఎస్ నేతలు వారికి రోడ్డు మీదే భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు
ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం
వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న భోజనాల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
తమకు ఆకలేస్తుందని భోజనాలను పంపాలని పోలీసుల కాళ్లు పట్టుకొని,… https://t.co/V7hqk7jyfS pic.twitter.com/4sOLa1341p
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2026
Read Also :
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్‌లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

