ఖమ్మం రూరల్, మార్చి 10 : ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు-పోలేపల్లి హై స్కూల్లో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. గోళ్లపాడు, పోలేపల్లి గ్రామాల సర్పంచులు గుండు శ్రావణి శ్రీనివాస్, బత్తిని మహేశ్తో కలిసి గోళ్లపాడు వాసి పంతులు నాయక్ 50 మంది విద్యార్థులకు అవసరమైన ఫ్యాడ్ లు, పెన్నులు, జామెంటరీ బాక్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, విద్యార్థులు శ్రద్ధతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా గ్రామానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రంగా వెంకట్రావు, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మద్ది వీరారెడ్డి, సింగిరెడ్డి బోస్ రెడ్డి, కొండం ప్రభాకర్, తాళ్లపల్లి నవీన్ పాల్గొన్నారు.