గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Sep 30, 2020 , 16:45:57

RR vs KKR: సమవుజ్జీల సమరం..!

RR vs KKR: సమవుజ్జీల సమరం..!

దుబాయ్: ఐపీఎల్-13వ  సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్నది.  బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు  విశేషంగా రాణిస్తుండటంతో మ్యాచ్‌లు హోరాహోరీ జరుగుతున్నాయి.   బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.  రెండు టీమ్‌లు  సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.  వరుసగా రెండు థ్రిల్లింగ్‌ విక్టరీలతో జోరుమీదున్న రాజస్థాన్‌,  గత మ్యాచ్‌లో   గెలుపుతో పాయింట్ల ఖాతా తెరిచిన కోల్‌కతా బరిలో దిగుతున్నాయి. 

సీజన్‌లో తొలిసారి దుబాయ్‌ వేదికగా రెండు జట్లు తమ మొదటి  మ్యాచ్‌ ఆడబోతున్నాయి.  పాయింట్ల పట్టికలో  స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని రాజస్థాన్‌(4 పాయింట్లు 2 మ్యాచ్‌ల్లో గెలుపు)  అగ్రస్థానంలో ఉండగా  దినేశ్‌  కార్తీక్‌ కెప్టెన్సీలోని కోల్‌కతా( 2 పాయింట్లు,  ఒక ఓటమి, ఒక గెలుపు) ఏడో స్థానంలో ఉంది.  ఇరు జట్లలో  బ్యాటింగ్‌,  బౌలింగ్‌  లైనప్‌లు పటిష్ఠంగా ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది. గత మ్యాచ్‌ల్లో  గెలిచిన ఉత్సాహంలో ఉన్న రాజస్థాన్‌, కోల్‌కతా అదే ఊపును కొనసాగించాలని  భావిస్తున్నాయి.