మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 13:36:23

యూఏఈ బయలుదేరిన తొలి టీమ్‌ పంజాబ్‌

యూఏఈ బయలుదేరిన తొలి టీమ్‌ పంజాబ్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు బృందం త్వరలో ఆరంభంకానున్న సీజన్‌ కోసం యూఏఈకి బయలుదేరింది.  యూఏఈకి వెళ్తున్న తొలి టీమ్‌ పంజాబే.   కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఆటగాళ్లు  ప్రత్యేక విమానంలో ఉండగా తీసిన ఫొటోను షేర్‌ చేస్తూ దుబాయ్‌ బయలుదేరాం అంటూ    సీనియర్‌ పేసర్‌ మహమ్మద్ షమీ ట్విటర్లో పోస్ట్‌ చేశాడు.    ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు లీగ్‌ నిర్వహిస్తున్నారు. 


logo