గురువారం 28 జనవరి 2021
National - Jan 02, 2021 , 14:42:11

కిసాన్ గ‌ణ‌తంత్ర ప‌రేడ్ నిర్వ‌హిస్తాం..

కిసాన్ గ‌ణ‌తంత్ర ప‌రేడ్ నిర్వ‌హిస్తాం..

హైద‌రాబాద్‌:  ఒక‌వేళ కేంద్ర ప్ర‌భుత్వం కొత్త రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌కుంటే.. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో కిసాన్ గ‌ణ‌తంత్య్ర ప‌రేడ్‌ను నిర్వ‌హిస్తామ‌ని రైతు సంఘాలు పేర్కొన్నాయి.  40 రైతు సంఘాల‌తో ఏర్ప‌డిన యూనియ‌న్ ఈ విష‌యాన్ని తెలిపింది.  జ‌న‌వ‌రి 26వ తేదీ వ‌ర‌కు త‌మ డిమాండ్లు అంగీక‌రించ‌క‌పోతే, ఆ రోజున ట్రాక్ట‌ర్ల‌తో ఢిల్లీలో ప‌రేడ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్వ‌రాజ్ ఇండియా నేత యోగేంద్ర యాద‌వ్ తెలిపారు. ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఈ ర్యాలీలో పాల్గొనాల‌ని, దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలు త‌మ ఇంటి నుంచి ఓ వ్య‌క్తిని ఢిల్లీకి పంపాల‌ని యోగేంద్ర కోరారు. ఈనెల 23వ తేదీన ప్ర‌తి రాష్ట్రంలోనూ గ‌వ‌ర్న‌ర్ ఇండ్ల‌ను ముట్టడి చేయ‌నున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియ‌న్ అధ్య‌క్షుడు ద‌ర్శ‌న్ పాల్ తెలిపారు.  26వ తేదీన జ‌ర‌గ‌నున్న గ‌ణ‌తంత్య్ర వేడుక‌ల‌కు బ్రిటీష్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అతిథిగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. 


logo