కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!!
కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!! కోవిడ్-19 వ్యాక్సిన్లతోపాటు ఔషధాలు, పరికరాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని .....

న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్‌తో దేశమంతా అల్లకల్లోలమవుతున్నది. అత్యధిక రోగులు ఆక్సిజన్ వెంటిలెటర్ల మద్దతుతో చికిత్స పొందాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి పరికరాలు, మహమ్మారిని నియంత్రించడానికి వ్యాక్సిన్ల తయారీకి ముడి సరుకుపై దిగుమతి సుంకం విధిస్తున్నది కేంద్రం.
ఇదీ ఉపసంఘం సిఫారసు
కోవిడ్-19 వ్యాక్సిన్లతోపాటు ఔషధాలు, పరికరాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని మేఘాలయ సీఎం కన్రడ్ సంగ్మా సారధ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిందని సమాచారం. ఈ ఉపసంఘంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు.
కరోనా ఔషధాలు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గించి రోగులకు రిలీఫ్ ఇవ్వాలని దేశంలోని అన్ని వర్గాల నుంచి అభ్యర్థనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై చర్చించి, నిర్ణయించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నియమించింది.
టాక్స్ తగ్గించాల్సిన పరికరాలివే
మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, పల్స్ ఆక్సీ మీటర్, కొవిడ్ టెస్టింగ్ కిట్స్ తదితరాలపై పన్ను తగ్గించాలని మంత్రివర్గం ఉపసంఘం సిఫారసు చేసినట్లు తెలిసింది.
వ్యాక్సిన్లపై పన్ను తగ్గించాలంటే..
వ్యాక్సిన్లపై జీఎస్టీ తగ్గింపు విషయమై జీఎస్టీ కౌన్సిల్లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులపై త్వరలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానున్నదని తెలుస్తున్నది.
బ్లాక్ ఫంగస్ ఔషధాలపై మినహాయింపుపై ఇలా
బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కన్రాడ్ సంగ్మా సారధ్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. దీని చికిత్సకు అవసరమైన ఆంఫోథ్రాసిన్-బీ డ్రగ్‌పై దిగుమతి సుంకాన్ని మినహాయించాలని గత నెల 28న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
ఉపసంఘం బాటలోనే ఫిట్మెంట్ కమిటీ
గత నెలలో ఏర్పాటైన జీఎస్టీ ఫిట్ మెంట్ కమిటీ కూడా కోవిడ్ డ్రగ్స్, పరికరాలపై పన్నును ఐదు శాతానికి తగ్గించాలని సిఫారసు చేసింది. జూలై నుంచి తగ్గించాలని సూచించింది. అయితే, పీపీఈ కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్లు, ఎన్-95 సర్జికల్ మాస్క్‌లు, అంబులెన్స్‌లపై పన్ను యధాతథంగా కొనసాగించాలని సూచించింది.
కొవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలపై జీఎస్టీ ఇలా
దేశీయంగా ఉత్పత్తవుతున్న కొవిడ్ వ్యాక్సిన్లపై ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఇక ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ కేంద్రం వసూలు చేస్తున్నది. విపక్షాలతోపాటు సామాజిక సంస్థలు కూడా జీఎస్టీ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశాయి.
ఇవి కూడా చదవండి:
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్‌లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్‌పై కేసు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

