e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

న్యూఢిల్లీ: ఈ-కామ‌ర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, రిల‌య‌న్స్ రిటైల్‌ల‌తో పోటీ ప‌డేందుకు టాటా స‌న్స్ సిద్ధం అవుతున్న‌ది. అందుకోసం త‌న ఈ కామ‌ర్స్ విభాగాన్ని బ‌లోపేతం చేసే దిశ‌గా కీల‌క ముంద‌డుగు వేసింది.

టాటా స‌న్స్ అనుబంధ సంస్థ టాటా డిజిట‌ల్‌.. తాజాగా ఫిట్‌నెస్ స్టార్ట‌ప్ క్యూర్‌ఫిట్ హెల్త్ కేర్‌లో 75 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డీల్ విలువ రూ.550 కోట్లు అని తెలుస్తున్న‌ది. అయితే, క్యూర్‌ఫిట్‌లో ఎంత శాతం వాటా కొనుగోలు చేశార‌న్న విష‌యం వెల్ల‌డించ‌లేదు.

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

టాటా డిజిట‌ల్ అధ్య‌క్షుడిగా క్యూర్‌ఫిట్ ఫౌండ‌ర్‌

క్యూర్‌ఫిట్ వ్య‌వ‌స్థాప‌కులు ముకేశ్ బ‌న్సాల్ తాజాగా టాటా డిజిట‌ల్‌లో చేర‌నున్నారు. ఆయ‌న‌ను టాటా డిజిట‌ల్ ప్రెసిడెంట్‌గా నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. అయినా, క్యూర్‌ఫిట్‌లోనూ ముకేశ్ బ‌న్సాల్ ముఖ్య‌మైన పాత్ర పోషించ‌నున్నారు.

పెట్టుబ‌డుల కొర‌త‌ను ఎదుర్కొంటున్న సంస్థ‌ల‌ను స్వాధీనం చేసుకోవ‌డం ద్వారా ఈ-కామ‌ర్స్ విభాగాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డంపై టాటా స‌న్స్ కేంద్రీకరించింది. ఈ దిశ‌గా క్యూర్‌ఫిట్‌లో టాటా డిజిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ స‌రైన చ‌ర్య అని భావిస్తున్నారు.

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

2025క‌ల్లా12 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు ఇండియ‌న్ ఫిట్‌నెస్ మార్కెట్‌

భార‌త ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ మార్కెట్ ఏటా 20 శాతం పురోభివ్రుద్ధి సాధిస్తుంద‌ని టాటా డిజిట‌ల్ పేర్కొంది. వ‌చ్చే నాలుగేండ్ల‌లో అంటే 2025 నాటికి 12 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

క్యూర్‌ఫిట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ-కామ‌ర్స్ రంగంలో విస్త‌ర‌ణ‌కు వెసులుబాటు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. టాటా డిజిట‌ల్, క్యూర్‌ఫిట్ మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందంపై ఇరు సంస్థ‌లు సంత‌కాలు చేశాయి. ఈ ఒప్పందానికి నియంత్ర‌ణ సంస్థ‌ల ఆమోదం ల‌భించాల్సి ఉంది.

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

క్యూర్‌ఫిట్ మాకు త‌గిన సంస్థ అన్న టాటా స‌న్స్‌

క్యూర్‌ఫిట్‌తో భాగ‌స్వామ్య ఒప్పందం చాలా మంచిద‌ని, త‌మ‌కు త‌గిన సంస్థ అని టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ పేర్కొన్నారు. వెల్‌నెస్‌తో వినియోగ‌దారుల జీవితాల్లో ఇది స‌మ‌గ్ర భాగంగా మారుతుంద‌ని అన్నారు. టాటా డిజిట‌ల్‌లోకి ముకేశ్ బ‌న్సాల్‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. ముకేశ్‌కు రెండు సంస్థ‌లు న‌డిపిన అనుభ‌వం ఉంది.

ఎక్సైటింగ్‌గా ఉంద‌న్న ముకేశ్ బ‌న్సాల్‌

టాటా డిజిట‌ల్‌లో చేరే స‌మ‌యం కోసం ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్న‌ట్లు ముకేశ్ బ‌న్సాల్ చెప్పారు. బ‌న్సాల్‌తోపాటు ఆయ‌న టీం కూడా టాటా డిజిట‌ల్‌లో చేరుతుంది. క్యూర్‌ఫిట్ దిశ‌గా త‌మ క్రుషి త‌మ‌కు ల‌భించిన గుర్తింపు అని పేర్కొన్నారు బ‌న్సాల్‌.

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

ఇంత‌కుముందు ముకేశ్ బ‌న్సాల్.. మైంత్రా అనే ఫ్యాష‌న్ స్టార్ట‌ప్‌ను స్థాపించారు. త‌ర్వాత దాన్ని విక్ర‌యించాక ఫిప్ల్‌కార్ట్‌లో చేరారు. 2016లో ఫ్లిప్‌కార్ట్ మాజీ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ అంకిత్ నాగోరీతో క‌లిసి క్యూర్‌ఫిట్‌ను స్థాపించారు.

2019లో టాటా డిజిట‌ల్ ప్రారంభం

దాదాపుగా రెండేండ్ల క్రితం 2019 ఆగ‌స్టులో టాటా డిజిట‌ల్ ఏర్పాటైంది. వినియోగ‌దారులే కేంద్రంగా డిజిట‌ల్ బిజినెస్ నిర్మాణం దిశ‌గా గ‌త నెల‌లో ఆన్‌లైన్ గ్రాస‌రీ స్టోర్ బిగ్ బాస్కెట్‌లో మెజారిటీ వాటాను 130 కోట్ల డాల‌ర్ల‌కు టేకోవ‌ర్ చేసింది. క్యూర్‌ఫిట్ వ్య‌వ‌స్థాప‌కుడు ముకేశ్ బ‌న్సాల్.. ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

ట్రెండింగ్‌

Advertisement