భారత్‌లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
భారత్‌లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!! భారత్‌లో క్రిప్టో కరెన్సీలు ఒక అసెట్ క్లాస్‌గా ఆమోదించాలని ఇన్ఫోసిస్ సహ ...

న్యూఢిల్లీ: భారత్‌లో క్రిప్టో కరెన్సీలు ఒక అసెట్ క్లాస్‌గా ఆమోదించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు-చైర్మన్, ఆధార్ ఐడెంటిటీ సిస్టం ఆర్కిటెక్ నందన్ నిలేకని కోరారు. ఒకవేళ నియంత్రణ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా భారత్‌లో రోజు రోజుకు క్రిప్టో కరెన్సీని ఆమోదించే వారు పెరుగుతున్నారన్నారు.
బంగారాన్ని, భూమిని మీరు ఆస్తిగా భావిస్తే, మీలో కొందరు క్రిప్టో కరెన్సీని కూడా మీ ఆస్తిగా భావిస్తారని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నందన్ నిలేకని చెప్పారు. అయితే, క్రిప్టో కరెన్సీ స్టోర్డ్ వాల్యూ అని, దానికి లావాదేవీల సెన్స్ లేదన్నారు.
భారత్ ఇప్పటికీ పేమెంట్ మోడ్‌గా క్రిప్టో కరెన్సీని ఆమోదించలేదని నిలేకని అన్నారు. క్రిప్టో కరెన్సీలో అనిశ్చితి వల్ల, ఇంధనాన్ని ధ్వంసం చేస్తున్నందు వల్ల ప్రభుత్వ కరెన్సీకి ప్రత్యామ్నాయం కాలేదన్నారు.
క్రిప్టో కరెన్సీని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తే.. క్రిప్టో కరెన్సీ పెట్టుబడి దారులు తమ సంపదను భారత ఆర్థిక వ్యవస్థలో మదుపు చేయడానికి వస్తారని ఏంజిల్ ఇన్వెస్టర్ బాలాజీ శ్రీనివాసన్, బ్లూం వెంచర్స్‌కు చెందిన కార్తీక్ రెడ్డిలతో జరిగిన చర్చాగోష్టిలో నిలేకని అన్నారు.
మీరు క్రిప్టో కరెన్సీని అసెట్‌గా భావిస్తే, క్రిప్టో కరెన్సీని కలిగి ఉండేందుకు అనుమతించాలని నిలేకని తెలిపారు. ఒక రోజులో కోటి లావాదేవీలు జరిపే యూపీఐ మాదిరిగా క్రిప్టో కరెన్సీ ఒక మీడియం లావాదేవీగా ఉండదన్నారు. కానీ, క్రిప్టో కరెన్సీ అపారమైన పెట్టుబడి అన్నారు.
భారత నియంత్రణ అధికారులు కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఏర్పాటు చేయాలని పరిశీలిస్తున్నారన్నారు. మనకు ఒక ప్రైవేట్ స్టేబుల్ కాయిన్ అవసరమా.. లేదా.. అనేది చెప్పలేమన్నారు. ఒక డిజిటల్ రూపాయి ఉంటే చాలన్నారు.
2018లో దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఆర్బీఐ నిషేధం విధించింది. కానీ గతేడాది ఆర్బీఐ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ, బ్యాంకర్లు 2018 ఆర్బీఐ ఆదేశాల అమలుకు పూనుకున్నాయి. దీంతో 2018లో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి:
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
సెంట్రల్ బ్యాంక్, ఐఓబీలో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహలు
అన్‌లాక్ షురూ : మెట్రో రైల్, మార్కెట్లు ఓపెన్
కొవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌తోనే ఎక్కువ యాంటీబాడీలు!
మళ్లీ అమ్మాయి పుట్టిందని భార్యా పిల్లలను బావిలోకి తోసేసిన భర్త
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా
జూలై 1 నుంచి బ్యాడ్ బ్యాంక్ ప్రారంభం?! ఎందుకంటే?!
చోక్సీ అప్పగింత డౌటేనా? అసలేం జరిగింది?!
స్వల్పకాలం కార్ల ధరలు స్టేబుల్: ఫోక్స్ వ్యాగన్
చోక్సీ కిడ్నాప్‌పై దర్యాప్తు షురూ!
నిబంధనల ప్రకారమే ఎంపీ రఘురామ ఫోన్ సీజ్ చేశాం : ఏపీ సీఐడీ
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్‌ఖాన్..ఫొటోలు వైరల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

