దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు
దేశంలో ప్రమాదకరమైన కరోనా మరో వేరియంట్ గుర్తింపు | దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. భారత్‌లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో ప్రమాదకరమైన వైరస్‌ను గుర్తించారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో కరోనా వైరస్ ‘బీ.1.1.28.2 కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్, యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను సేకరించి.. జన్యుక్రమాల (జీనోమ్ సీక్వెన్సింగ్)ను విశ్లేషించగా ‘బీ.1.1.28.2’ వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
వేరియంట్‌ను తొమ్మిది సిరియన్ రకానికి చెందిన ఎలుకల్లో ప్రవేశ పెట్టగా.. ఇన్ఫెక్షన్ సోకిన వారం రోజుల్లోనే లక్షణాలు బయటపడడం ప్రారంభమైందని పరిశోధకులు తెలిపారు. శరీరంలో ఇన్ఫెక్షన్ భారీగా వ్యాపించడంతో మూడు ఎలుకలు చనిపోయాయని పేర్కొన్నారు. వేరియంట్ కొత్త వేరియంట్ శరీర బరువు తగ్గించిందని, శ్వాసకోశ, ఊపిరితిత్తుల్లో సమస్యలకు కారణమైందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ డెల్టా వేరియంట్‌తో సమానమని, ఆల్ఫా వేరియంట్ కంటే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, వైరస్‌పై వ్యాక్సిన్ల సమర్థతను తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
డేరా బాబాకు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

