కెనడాలో వింత వ్యాధి
- నిద్రలేమి, పీడకలలు, భ్రమ లాంటి లక్షణాలు
- న్యూబ్రన్స్విక్ ప్రావిన్స్‌లో హాస్పిటళ్లకు 48 మంది

న్యూఢిల్లీ, జూన్ 6: కెనడాలో వింత వ్యాధి ప్రజలను భయపెడుతున్నది. నిద్రలేమి, కండరాల బలహీనత, భ్రమ, పీడకలల భయం లాంటి లక్షణాలతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కెనడాలోని న్యూబ్రన్స్విక్ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది ఈ వింత వ్యాధి బారిన పడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు 48 మంది ఈ లక్షణాలతో దవాఖానల్లో చేరారు. ఈ లక్షణాలకు గల కారణం ఏమిటన్నది వైద్యులకు, న్యూరాలజీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆరేండ్ల కింద మొదట ఈ వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధితో మరణించి ఆరుగురి మెదడులపై పరిశోధనలు నిర్వహించినా వ్యాధికి గల కారణం ఏమిటన్నది తెలియలేదు. సెల్‌ఫోన్ టవర్ల వల్లే ఇలా జరుగుతుందని కొందరు, కరోనా వ్యాక్సిన్లే కారణమని కొందరు భావిస్తుండగా, వాతావరణంలో మార్పులే ఈ వ్యాధికి కారణమని మరికొందరు వాదిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Canada
- Strange disease
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

