ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి | పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు.

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్స్‌ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలును.. మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. గాయపడ్డ వారిని దవాఖానాలకు తరలించారు. రెండు రైళ్ల బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత ఆ రూట్లో నడిచే రైళ్లను నిలిపి వేసినట్లు అబ్దుల్లా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

