అధిష్ఠానం కోరితే రాజీనామా చేస్తా

కర్ణాటక సీఎం యెడియూరప్ప
బెంగళూరు, జూన్ 6: బీజేపీ హైకమాండ్ తనమీద నమ్మకం ఉంచినంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం యెడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగనున్నదని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన స్పందించారు. ‘హైకమాండ్ నామీద నమ్మకం ఉంచినన్ని రోజులు నేను ముఖ్యమంత్రిగా ఉంటా. అధిష్ఠానం నాకు ఒక అవకాశం ఇచ్చింది. దానిని మంచి చేయడానికోసం ఉపయోగిస్తాను. వాళ్లు నన్ను వద్దనుకున్న రోజు రాజీనామా చేసి రాష్ర్టాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాను’ అని చెప్పారు. రాష్ట్రంలో తనకు ప్రత్యామ్నాయ నాయకుడు మరొకరు లేరనే వాదనతో తాను ఏకీభవించనని, రాష్ట్రంలోనే గాక దేశంలో ప్రత్యామ్నాయ నాయకులు ఎప్పుడూ ఉంటారని సీఎం యెడియూరప్ప వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Karnataka CM
- yadiyurappa
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

