అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్ | మహారాష్ట్ర అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది.

ముంబై : మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె ఎంపీ పదవి ప్రమాదంలో పడింది. నవనీత్ కౌర్ నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని హైకోర్టు గుర్తించింది. ఈ మేరకు తీర్పునిచ్చిన ధర్మాసనం.. రూ.2లక్షల జరిమానా చెల్లించి.. ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నవనీత్ నకిలీ సర్టిఫికెట్తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించారని ఆనందరావు ఆరోపించారు.
నవనీత్ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎన్సీపీ తరఫున పోటీ చేయగా.. ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా.. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. నవనీత్ అమరావతిలో బద్నేరాకు చెందిన ఎమ్మెల్యే రవి రాణా భార్య. కన్నడ చిత్రం ‘దర్శన్ ’చిత్రంతో నవనీత్ సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మితో పాటు పలు చిత్రాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
ఢిల్లీ మెట్రో రికార్డు.. అన్‌లాక్ తొలిరోజే 4.5లక్షల మంది ప్రయాణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

