గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం | కరోనా సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి.

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చాయి. అలాగే గంగానది ఇసుక తిన్నెల్లో శవాలు బయటపడ్డాయి. అవన్నీ కరోనా మృతులవేనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గంగా నదిలో కరోనా మహమ్మారి ఆనవాళ్లను తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌లో దశలవారీగా అధ్యయనం చేపట్టనుండగా.. మొదటి దశలో యూపీలోని కన్నౌజ్, బిహార్‌లోని పాట్నా జిల్లాల్లోని 13 ప్రాంతాల నుంచి ఇప్పటికే నమూనాలను సేకరించినట్లు లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ్ బాటిక్ తెలిపారు.
అధ్యయనం సమయంలో నీటిలో వైరస్ల ఆర్ఎన్ఏ ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తద్వారా వైరస్ ఉనికి తెలుస్తుందని బాటిక్ తెలిపారు. అధ్యయనం నది జీవ లక్షణాల పరిశీలనలో సైతం ఓ భాగమని చెప్పారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. నదిలో నీరు కలుషితం కాకుండా చూస్తున్నామని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇటీవల కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. గంగానదిలో ఇటీవల కొట్టుకువచ్చిన మృతదేహాలన్నీ కరోనా మృతులవేనన్న ఆరోపణలున్నాయి.
పలు ప్రాంతాలకు గంగానదే ప్రధాన తాగునీటి వనరు కాగా.. నీరంతా కలుషితమైందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. నదిలో వైరస్ ఉండే అవకాశం లేదని నిపుణులు కొట్టిపారేశారు. అయినప్పటికీ, అధ్యయనం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చామని ఎన్ఎంసీజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీపీ మాధురియా తెలిపారు. సీఎస్ఐఆర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, యూపీ, బిహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల సహకారంతో ఈ అధ్యయనం నిర్వహిస్తున్నట్లు మాధురియా వివరించారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

