వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!| 2021-22)లో జీడీపీ వృద్ధిరేటును ప్రపంచ బ్యాంకు కుదించి వేసింది. ఈ ఏడాదిలో వృద్ధిరేటు 8.3 ...

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో జీడీపీ వృద్ధిరేటును ప్రపంచ బ్యాంకు కుదించి వేసింది. ఈ ఏడాదిలో వృద్ధిరేటు 8.3 శాతానికి మాత్రమే పరిమితమని పేర్కొంది. ఇంతకుముందు అది 10.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థతోపాటు సర్వీసుల రంగాలను కరోనా రెండో వేవ్ పూర్తిగా దెబ్బ తీసిందని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది.
గ్లోబల్ ఎకానమీ 5.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. 2019లో భారత ఎకానమీ వృద్ధిరేటు 4 శాతంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. 2022-23లో 6.5 శాతానికి చేరొచ్చునని అంచనా వేసింది.
ఇటీవలే దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా జీడీపీ గ్రోత్ రేటును తగ్గించి వేసింది. తొలుత 11 శాతంగా వృద్ధిరేటు రికార్డవుతుందని పేర్కొన్న క్రిసిల్.. తర్వాత 9.5తో సరిపెట్టింది.
కరోనా రెండో వేవ్ కేసులు పెరగడంతో ప్రయివేట్ వినియోగంపైనా, ఇన్వెస్ట్మెంట్లపైనా ప్రతికూల ప్ఱభావం పడిందని క్రిసిల్ వ్యాఖ్యానించింది. ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా ప్రపంచ బ్యాంక్, క్రిసిల్ బాటలోనే పయనించింది.
2022 మార్చి నెలాఖరుతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 9.3 శాతంగా నమోదు కావచ్చునని మూడీస్ అంచనా వేసింది. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corona
- gdp
- India
- World Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

