న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థల్లో పియాజియో ఒకటి. తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో బిజిబిజీగా గడుపుతున్నది. తాను రూపొందించిన వన్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించింది.
తాజాగా సదరు ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ ట్రైన్, వేరియంట్ల వివరాలను వెల్లడించింది. వన్, వన్ ప్లస్, వన్ యాక్టీవ్ అనే వేరియంట్లలో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్క్రుతం అవుతుంది.
మూడు వేరియంట్లు సేమ్ డిజైన్‌తో ఉన్నా ఫీచర్లు మాత్రం విభిన్నంగా ఉంటాయి. వాటి పెర్ఫార్మెన్స్, రైడింగ్ రేంజ్ వేర్వేరుగా ఉంటాయి. 1.8 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో పియాజియో వన్ లభ్యం అవుతుంది.
2బీహెచ్పీ మోటార్‌తో 85 ఎన్ఎం టార్చి ఆఫర్ చేస్తుంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 55 కి.మీ. వరకు వెళ్లొచ్చు.
పియాజియో వన్ ప్లస్ స్కూటర్ 2.3 కిలో వాట్ల సామర్థ్యం గల బ్యాటరీతో వస్తున్నది. ఒకసారి చార్జి చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించొచ్చు. గంటకు 55 కి.మీ. స్పీడ్‌తో ప్రయాణం చేయవచ్చు.
ఒక్కసారి చార్జి చేస్తే 85 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం గల వన్ యాక్టివ్ అత్యంత పవర్ఫుల్ వేరియంట్‌గా నిలుస్తుంది. 95 ఎన్ఎం పీక్ టార్చి డెలివరీ సామర్థ్యంతో 3 కిలోవాట్ల మోటార్ కలిగి ఉంటుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగం దీని సొంతం.
పియాజియో వన్ చూడటానికి సంప్రదాయ పెట్రోల్ ఆధారిత స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది. డీఆర్ఎల్స్తో ట్విన్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్, కంపాక్ట్ సైడ్ ప్యానెల్స్, బ్లాక్ హ్యాండిల్ కౌల్, ఇన్సర్ట్స్ ఆన్ ది ఆప్రోన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, వైడ్ సీట్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ లైట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్‌లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్‌పై కేసు