e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే పెట్రోల్ పైపైకే!

ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే పెట్రోల్ పైపైకే!

ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే పెట్రోల్ పైపైకే!

న్యూఢిల్లీ: వాహ‌న‌దారుల్లారా.. పారా హుషార్‌.. ఎందుకంటే దేశంలో ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 మార్క్ దాటేసింది.. ఆ దిశ‌గా డీజిల్ కూడా వ‌డివ‌డిగా ప‌రుగులు తీస్తున్న‌ది. రాజ‌స్థాన్‌లోని శ్రీ‌గంగాన‌గ‌ర్‌లోనే డీజిల్ ధ‌ర రూ.100 మార్క్ దాట‌డానికి చేరువ‌లో ఉన్న‌ది.

ఇప్పుడు శ్రీ‌గంగా న‌గ‌ర్‌లో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.99.24 ప‌లికింది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే త్వ‌ర‌లో డీజిల్ కూడా సెంచ‌రీ మార్క్‌ను దాటేయ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది.

త్వ‌ర‌లో బ్యారెల్ ముడి చ‌మురు 75$

ఇరాన్‌పై అమెరికా ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 75 డాల‌ర్లు ప‌లికే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు 71 డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉంది.

క్రూడాయిల్‌కు ఇలా డిమాండ్‌

యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాల్లో ప్ర‌జా జీవ‌నం సాధార‌ణ స్థాయికి చేరుతుండ‌టంతో క్రూడ్ ఆయిల్‌కు కూడా డిమాండ్ పెరుగుతున్న‌ది. సోమ‌వారం ముడి చ‌మురు ధ‌రలు రెండేండ్ల గ‌రిష్ఠానికి చేరుకున్నాయి.

భార‌త్ అవ‌స‌రాలు 85% దిగుమ‌తిపైనే

భార‌త ఇంధ‌న అవ‌స‌రాలు 85 శాతానికి పైగా దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డ్డాయి. ఇరాన్‌పై అమెరికా, ఇత‌ర పాశ్చాత్య దేశాలు ఆంక్ష‌లు ఎత్తేస్తే ముడి చ‌మురు చౌక‌గా ల‌భిస్తుంది. 2019కి ముందు ఇరాన్ నుంచి ముడి చ‌మురు దిగుమ‌తి చేసుకున్న దేశాల్లో భార‌త్‌కు రెండో స్థానం ఉంది.

ఇరాన్ నుంచి ఇవీ ప్ర‌యోజ‌నాలు

ఇరాన్ నుంచి ముడి చ‌మురు కొనుగోలు చేస్తే భార‌త్‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. చౌక ర‌వాణ‌తోపాటు షార్ట్‌క‌ట్‌లో చేరుతుంది. ఇరాన్‌కు మ‌న రూపాయిల్లోనే చెల్లించొచ్చు. ఇత‌ర దేశాల‌కు డాల‌ర్ల‌లో చెల్లించాలి. ఇరాన్‌పై నిషేధంతో భార‌త్ భారీగా భారీగా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తున్న‌ది.

2019లో ఇరాన్ నుంచి క్రూడ్ దిగుమ‌తి నిలిపివేత‌

అమెరికా ఆంక్ష‌ల‌తో 2019 నుంచి ఇరాన్ నుంచి క్రూడ్ దిగుమ‌తిని భార‌త్ నిలిపేసింది. ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తివేసే విష‌య‌మై వ‌చ్చేవారంలో స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఇలా డిపెండెంట్‌

నాలుగు అంశాల‌పై పెట్రోల్ లేదా డీజిల్ ధ‌ర‌లు ఆధార‌ప‌డి ఉన్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌, డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ‌, ప‌న్నులు, డిమాండ్ స్థాయిని బ‌ట్టి వాటి ధ‌ర‌లు ఆధార‌ప‌డి ఉన్నాయి.

ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే..

ఒక‌వేళ ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే ముడి చ‌మురుకు మున్ముందు డిమాండ్ పెరిగి ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధ‌ర 75 డాల‌ర్లు ప‌లుకుతుంద‌ని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ప్ర‌తినిధి అనూజ్ గుప్తా చెప్పారు.

డాల‌ర్ బ‌లోపేత‌మైతే.. ఇలా

అమెరికాలో ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ పూర్తి కావ‌చ్చింది. ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిర‌ప‌డితే డాల‌ర్ విలువ పెరుగుతుంది. ఒక‌టి, రెండు నెల‌ల్లో డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ రూ.75ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా.

త్వ‌ర‌లో పెట్రో ఉత్ప‌త్తుల‌పై రూ.3 భారం

ప్ర‌స్తుతం డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ 73 డాల‌ర్ల‌కు చేరువ‌లో ఉంది. దీన్ని బ‌ట్టి మున్ముందు పెట్రోల్, డీజిల్ మ‌రింత ప్రియం కానున్నాయి. మున్ముందు లీట‌ర్ పెట్రోల్/డీజిల్ ధ‌ర రూ.2 నుంచి 3 పెరిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.

పెట్రోల్ లేదా డీజిల్ బేస్ రేట్ రూ.33

ఇప్ప‌టికీ లీట‌ర్ పెట్రోల్ లేదా డీజిల్ ధ‌ర సుమారు రూ.33 మ‌ధ్యే కొన‌సాగుతున్న‌ది. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ ప‌న్నుల‌తో అది రూ.100ల‌కు చేరుకున్న‌ది.

3 రెట్లు పెంచిన కేంద్ర‌, రాష్ట్రాల సుంకాలు

కేంద్ర ప్ర‌భుత్వం రూ.33 ఎక్సైజ్ సుంకం విధిస్తున్న‌ది. దీంతోపాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్‌, సెస్ వంటి ప‌న్నులు విధిస్తున్నాయి. ఫ‌లితంగా బేస్ ధ‌ర మూడు రెట్ల‌కు పెరిగింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

షాకింగ్ :సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టినా ఊపందుకోని నియామ‌కాలు!

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

ఇండియాలో లాంచ్ అయిన మ‌రో ఖ‌రీదైన కారు

భార‌త్‌లోనూ క్రిప్టో ఒక అసెట్‌: నంద‌న్ నిలేక‌ని సంచ‌ల‌నం!!

టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..

వ్యాక్సిన్ తీసుకున్న వ‌రుడు కావాలి.. ఇదీ శ‌శీ థ‌రూర్ పంచ్‌

నేనేమీ న‌వాజ్ ష‌రీఫ్‌ను క‌లిసేందుకు వెళ్ల‌లేదు..

అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్‌

పుణె ప‌రిశోధ‌న : క‌రోనా కొత్త వేరియంట్ గుర్తింపు

వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్ల‌లో కోత‌.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం

వాట్సాప్ స్టేట‌స్‌.. రిపోర్ట‌ర్‌పై కేసు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే పెట్రోల్ పైపైకే!

ట్రెండింగ్‌

Advertisement