TVK Vijay | ఉత్కంఠ వీడింది.. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం..!
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఎన్నడూ చూడని ఉత్కంఠకు, గవర్నర్ గిరీకి తెరపడింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Rajendra Arlekar) ఎట్టకేలకు నాలుగో భేటీలో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు.
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఎన్నడూ చూడని ఉత్కంఠకు, గవర్నర్ గిరీకి తెరపడింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Rajendra Arlekar) ఎట్టకేలకు నాలుగో భేటీలో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్(Vijay Joseph)ను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. శనివారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల వివరాలు సమర్పించగా.. ఈసారి అర్లేకర్ అభ్యంతరం చెప్పకుండా సరేనన్నారు. దాంతో, ఆదివారం ఉదయం 10: 00 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన టీవీకే విజయ్ జోసెఫ్ ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారు. శనివారం నాటకీయ పరిణామాల మధ్య లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసిన విజయ్ తనకు మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా సంఖ్యా బలం ఉందని చెప్పారు. అందుకు అంగీకరించిన గవర్నర్ విజయ్‌కు ప్రభుతవ ఏర్పాటుకు అనుమతించారు. ఫలితంగా.. ఐదురోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడగా టీవీకే అధినేత ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరాం చేస్తారని సమాచారం. అయితే.. బుధవారం నాడు సభలో సీఎంగా విజయ్ బల నిరూపణలో గట్టెక్కాల్సి ఉంటుంది.
#WATCH | TVK Chief Vijay leaves from his Pattinapakkam residence in Chennai. He will take the oath as the Tamil Nadu CM at the swearing-in ceremony scheduled for 10 am tomorrow. pic.twitter.com/lP8zjz6d9N
— ANI (@ANI) May 9, 2026
“நீ ஏதாவது கோமாளி தனமா பண்ணுவ nu தான் கூட்டணி கட்சி ஆதரவாளர்கள கையோடு கூட்டிட்டு வந்து இருக்கேன்” ngra மாதிரி பண்ணி இருக்காரு அண்ணன்😂🔥#CMVijay #TVKVijay @TVKVijayHQpic.twitter.com/6xoPK7Wfp4
— Viki 𝙏𝙑𝙆🇪🇦 (@_ThalapathyViki) May 9, 2026
చిన్న పార్టీల మద్దతుతో
పార్టీ పెట్టిన రెండేళ్లకే అసెంబ్లే ఎన్నికల్లో సంచలన విజయం అనంతరం అన్నాడీఎంకే, డీఎంకేలతో పొత్తు వద్దనుకున్న విజయ్.. చిన్న పార్టీల మద్దతుతో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. డీఎంకేతో కూటమిలో కొనసాగిన సీపీఐ, సీపీఐ(ఎం)తో పాటు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వీసీకే, ఐయూఎంఎల్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో టీవేకే బలం 120కి చేరింది. దాంతో.. సీఎంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.
#UPDATE | The time for the oath ceremony of Tamil Nadu CM-designate Vijay has been changed to 10 am tomorrow, 10th May. https://t.co/hHRLN7ewWO pic.twitter.com/ABRKwP8k3T
— ANI (@ANI) May 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

