Mirrors in Mysuru | బహిరంగ మూత్ర విసర్జన నివారణకు.. అధికారులు ఏం చేశారంటే?
Mirrors in Mysuru | బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టేందుకు అధికారులు వినూత్నంగా ఆలోచించారు. జన రద్దీ ప్రాంతమైన బస్టాండ్ సమీపంలోని ప్రహరీ గోడ వద్ద అద్దంలా మెరిసే స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టివ్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. బహిరంగ మూత్ర విసర్జన చేసే వారిలో మానసిక నిరోధాన్ని సృష్టించారు.
బెంగళూరు: బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టేందుకు అధికారులు వినూత్నంగా ఆలోచించారు. జన రద్దీ ప్రాంతమైన బస్టాండ్ సమీపంలోని ప్రహరీ గోడ వద్ద అద్దంలా మెరిసే స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టివ్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. (Mirrors in Mysuru) బహిరంగ మూత్ర విసర్జన చేసే వారిలో మానసిక నిరోధాన్ని సృష్టించారు. కర్ణాటకలోని మైసూరులో ఈ సంఘటన జరిగింది. బహిరంగ మూత్ర విసర్జన నివారణకు మైసూరు నగరపాలక సంస్థ (ఎంసీసీ) వినూత్న పంథాను అనుసరించింది. సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని ప్రహరీ గోడ వెంబడి స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టివ్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. 80 మీటర్ల పొడవున్న ఖాళీ ప్రహరీ గోడ వెంబడి అద్దంలా మెరిసేలా వీటిని అమర్చింది.
కాగా, సాయంత్రం, రాత్రి వేళల్లో కూడా అద్దంలా స్పష్టంగా కనిపించేలా ఈ ప్యానెళ్ల చుట్టూ ఎల్ఈడీ లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. వీధి దీపాలతో పాటు ఈ లైట్లు కూడా ఆటోమేటిక్గా ఆన్, ఆఫ్ అవుతాయి. సుమారు రూ. 9.5 లక్షల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టారు.
మరోవైపు బహిరంగ మూత్ర విసర్జన కోసం స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టివ్ ప్యానెల్స్ వద్దకు వెళ్లే వారితో పాటు రోడ్డుపై ఉన్న వ్యక్తుల ప్రతిబింబం కనిపిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో బహిరంగ మూత్ర విసర్జనకు వ్యతిరేకంగా మానసిక నిరోధకాన్ని సృష్టిస్తుందని చెప్పారు. కర్ణాటకలో ఇలాంటిది ఏర్పాటు చేయడం ఇదే మొదటిదని అధికారులు వివరించారు.
అయితే అద్దంలా మెరిసే స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్లెక్టివ్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బహిరంగ మూత్ర విసర్జన సమస్యను పరిష్కరించడానికి మైసూరు నగరపాలక సంస్థ (ఎంసీసీ) చేపట్టిన ఈ వినూత్న విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా మంది దీనిని స్వాగతించారు. అయితే బహిరంగ మూత్ర విసర్జన సమస్యను ఇది ఎంత వరకు నివారిస్తుంది? అని పలువురు సందేహం వ్యక్తం చేశారు.
🚨 Authorities in Mysuru install large mirrors roadside to stop people from urinating in public. 👌
(📷-@theshashank_p) pic.twitter.com/xZPRUJkROc
— Indian Tech & Infra (@IndianTechGuide) May 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

