Mitchell Starc | ‘ఇది నీ దారి కాదు.. వికెట్ నుంచి పక్కకు జరుగు’.. బంగ్లా బ్యాటర్‌ను హెచ్చరించిన స్టార్క్..!
Mitchell Starc : ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) కోపంతో ఊగిపోయాడు. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే అతడు.. రెండో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్(Mehidy Hasan Miraz)ను కాస్త గట్టిగానే హెచ్చరించాడు.
Mitchell Starc : స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కోపంతో ఊగిపోయాడు. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే అతడు.. రెండో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్(Mehidy Hasan Miraz)ను కాస్త గట్టిగానే హెచ్చరించాడు. రన్ తీసే క్రమంలో మిరాజ్ బౌలర్ వెళ్లే మార్గంలో పరుగెత్తడంపై ఆగ్రహించిన స్టార్క్.. వికెట్ నుంచి పక్కకు జరుగు అని వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
డార్విన్ టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాళ్ల దూకుడుతో ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోయారు. ఓపెనర్ తంజిద్ హషన్ తమీమ్(101), నజ్ముల్ హుస్సేన్ శాంటో(84)లు భారీ స్కోర్‌కు పునాది వేయగా.. ఆ తర్వాత మెహిది హసన్ మిరాజ్(13 నాటౌట్) క్రీజునంటుకున్నాడు. ఆఖరి సెషన్లో వికెట్ కాపాడుకున్న అతడు బంగ్లా ఆధిక్యం 153కు చేరడంలో కీలకమయ్యాడు. అయితే.. స్టార్క్ బౌలింగ్‌లో అతడు వికెట్ల మధ్య పరుగెత్తడంపై ఆసీస్ పేసర్ మండిపడ్డాడు. బౌలర్ తిరిగి వెళ్లే మార్గంలో మిరాజ్ పరుగెత్తడంపై ఆగ్రహించిన స్టార్క్ వేలు చూపించి మరీ హెచ్చరించాడు.
“Get off the wicket!”
Mitchell Starc and Mehidy Hassan Miraz had a heated exchange in #AUSvBAN: https://t.co/854LsTds7l pic.twitter.com/fTJtsn4px8
— cricket.com.au (@cricketcomau) August 14, 2026
స్టార్క్‌ను గమనించిన అంపైర్ కుమార ధర్మసేన.. అలా బౌలర్ దారిలో పరుగెత్తవద్దు అని మిరాజ్‌ను మందలించాడు. అందుకు.. మిరాజ్ ‘లేదు లేదు.. అతడే అడ్డుగా ఉన్నాడు’ అని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ, అసలే పిచ్చి కోపంగా ఉన్న స్టార్క్.. ‘ఇది నీ స్థలం కాదు. నా దారి వికెట్ నుంచి పక్కకు జరుగు’ అని మిరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది బంగ్లాదేశ్. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉండడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని 250 ప్లస్ వరకైనా పెంచుకోవాలనే ఆలోచనతో ఉంది శాంటో సేన.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

