Delhi : ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ (High Alert)ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్ర కుట్రను భగ్నం చేసినందుకు ప్రతీకారంగా ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో ఐఈడీ(ఇంప్రూవైడ్జ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్)దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన, ఉద్రిక్తతలకు నెలవైన ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్, సిబ్బందితో తనిఖీలను తీవ్రం చేశారు.
ఢిల్లీ ప్రత్యేక పోలీసుల బృందం ఇటీవలే పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది షహజాద్ భాటీ( Shahzad Bhatti) కుట్రలను భగ్నం చేసింది. పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐకి పని చేస్తున్న షహజాద్‌తో పాటు తొమ్మిందిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా.. ఢిల్లీలో భారీ స్థాయిలో పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్టు తెలిపారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలు, దేవాలయాల ఫొటోలను హ్యాండ్లర్కు చేరవేశారనే సమాచారంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Delhi: Security has been intensified around the BJP state headquarters on DDU Marg following an intelligence alert regarding a possible terror attack. pic.twitter.com/B1i0F8GxDf
— IANS (@ians_india) May 9, 2026
ఢిల్లీలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం, ఇతర బీజేపీ జాతీయ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడమే కాకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ‘హిసార్‌లోని మిలిటరీ క్యాంప్ కొన్ని ప్రాంతాలను పరికించి.. సరిహద్దులోని హ్యాండర్లకు వీడియోలను పంపింది. ఢిల్లీలోనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఐఈడీ దాడులు జరిగే అస్కారముంది’ అని పీటీఐతో పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Intelligence inputs have triggered a terror alert in Delhi, prompting heightened security at the Bharatiya Janata Party headquarters and nearby government buildings. Agencies suspect possible targeting of DDU Marg offices using suicide attacks, car bombs, shootings, and IEDs.… pic.twitter.com/zeBT7YMcVX
— IANS (@ians_india) May 9, 2026
నిరుడు నవంబర్ 10న ఎర్రకోట వద్ద పేలుడు అనంతరం.. జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధమున్న వైట్ కాలర్ మాడ్యూల్‌ను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈసారి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా పోలీస్ యాంత్రంగం ముందస్తు చర్యలు చేపట్టింది.