చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ పార్టీ చీఫ్ విజయ్ నాలుగోసారి గవర్నర్‌ను కలిశారు. మెజారిటీ మద్దతు ఉన్న లేఖలను అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ అనుమతి కోరారు. (Vijay Oath Tomorrow) ఈ నేపథ్యలో ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే గవర్నర్ కార్యాలయం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా, శనివారం అనూహ్య పరిణామాలు జరిగాయి. ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు లేఖపై వివాదం తలెత్తింది. అది నకిలీ అంటూ ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. తన ఎమ్మెల్యే కనిపించడం లేదని, ఆయనను ప్రలోభాలకు టీవీకే గురిచేస్తున్నదని విమర్శించారు. నకిలీ మద్దతు లేఖ గురించి టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కామరాజ్‌తో కలిసి గవర్నర్‌ను దినకరన్ కలిశారు. అన్నాడీఎంకే అధినేత పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.
మరోవైపు శనివారం సాయంత్రానికి పరిస్థితులు మరో మలుపు తిరిగాయి. వీసీకేతోపాటు ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మెజారిటీ కంటే 120 సభ్యుల మద్దతు సమకూరింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. తనకు మద్దతు ఇచ్చిన పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌కు చేరుకున్నారు.
అయితే విజయ్‌కు తొలుత అపాయింట్మెంట్ను గవర్నర్ నిరాకరించారు. గవర్నర్ వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్లు లోక్‌భవన్ అధికారులు ఆయనకు తెలిపారు. మెజార్టీ సభ్యుల వివరాలను ఆదివారం లోక్‌భవన్‌లో సమర్పించాలని చెప్పారు. వాటిని పరిశీలించిన తర్వాత సోమవారం గవర్నర్ అపాయింట్మెంట్ లభించవచ్చని లోక్‌భవన్ అధికారులు ఫోన్లో వివరించారు. ఈ నేపథ్యంలో విజయ్ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
కాగా, విజయ్‌కు అపాయింట్మెంట్ నిరాకరించిన గవర్నర్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. తమిళనాడులో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్‌కు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో విజయ్ నాలుగోసారి గవర్నర్‌కు కలిశారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అనుమతి కోరగా గవర్నర్ సమ్మతించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 3.15 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read:
Vijay | వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకేకు మెజారిటీ.. విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్లో ట్విస్ట్
TTV Dhinakaran | ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతు లేఖపై వివాదం.. నకిలీ అంటూ టీవీకేపై దినకరన్ ఫిర్యాదు
Omar Abdullah | ‘మా పార్టీలో ‘ఎక్నాథ్ షిండేలు’ లేరు’.. చీలిక ఊహాగానాలపై ఒమర్ అబ్దుల్లా