Vijay | వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకేకు మెజారిటీ.. విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్లో ట్విస్ట్
Vijay | తమిళనాడులో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటులో అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. తాజాగా వీసీకేతోపాటు ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
చెన్నై: తమిళనాడులో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటులో అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. తాజాగా వీసీకేతోపాటు ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చాయి. (Vijay) దీంతో కావాల్సిన 118 మెజారిటీ సమకూరింది. ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్మెంట్ ఆయన కోరారు. అలాగే తనకు మద్దతు ఇచ్చిన పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌కు విజయ్ చేరుకున్నారు.
కాగా, విజయ్‌కు అపాయింట్మెంట్ను గవర్నర్ తొలుత నిరాకరించారు. గవర్నర్ వేరే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్లు లోక్‌భవన్ అధికారులు ఆయనకు తెలిపారు. మెజార్టీ సభ్యుల వివరాలను ఆదివారం లోక్‌భవన్‌లో సమర్పించాలని చెప్పారు. వాటిని పరిశీలించిన తర్వాత సోమవారం గవర్నర్ అపాయింట్మెంట్ లభించవచ్చని లోక్‌భవన్ అధికారులు ఫోన్లో వివరించారు. ఈ నేపథ్యంలో విజయ్ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
మరోవైపు విజయ్‌కు అపాయింట్మెంట్ నిరాకరించిన గవర్నర్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. తమిళనాడులో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. అందుకే ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్‌కు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించాయి.
అయితే విమర్శల నేపథ్యంలో గవర్నర్ దిగివచ్చినట్లు తెలుస్తున్నది. కేరళం పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
Also Read:
TTV Dhinakaran | ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతు లేఖపై వివాదం.. నకిలీ అంటూ టీవీకేపై దినకరన్ ఫిర్యాదు
Omar Abdullah | ‘మా పార్టీలో ‘ఎక్నాథ్ షిండేలు’ లేరు’.. చీలిక ఊహాగానాలపై ఒమర్ అబ్దుల్లా
Mamata Banerjee: ఎక్స్ ప్రొఫైల్‌ను ఎడిట్ చేసిన మమతా బెనర్జీ.. ఎలా మార్చారో చూశారా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

