Mamata Banerjee: ఎక్స్ ప్రొఫైల్ను ఎడిట్ చేసిన మమతా బెనర్జీ.. ఎలా మార్చారో చూశారా?
Mamata Banerjee : మమతా బెనర్జీ తన ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్లో మార్పులు చేశారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన 15, 16, 17వ విధాన సభలకు ముఖ్యమంత్రిగా చేసినట్లు రాశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన దీదీ.. తన రాజీనామాను సమర్పించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ పార్టీ ఓడిన విషయం తెలిసిందే. అయితే మోసపూరితంగా బీజేపీ గెలిచిందని, తన పదవికి రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ భీష్మించుకున్న విషయం తెలిసిందే. కానీ బెంగాల్ సర్కారును ఆ రాష్ట్ర గవర్నర్ ఏడవ తేదీన రద్దు చేశారు. ఇవాళ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తన ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్ను మార్చేశారు. ఓటమిని అంగీకరించిన రీతిలో ఆమె ప్రొఫైల్లో కనిపించింది. బయో డిటేల్స్ను తన ప్రొఫైల్లో ఆమె అప్డేట్ చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలి రాశారు. దాంతో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన 15, 16, 17వ విధాన సభలకు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు ఎడిట్ చేశారు. చాలా తెలివిగా దీదీ తన ప్రొఫైల్ బయోను ఎడిట్ చేశారు. భబానీపుర్ నుంచి పోటీ చేసిన ఆమె సువేందు చేతిలో ఓటమిపాలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

