TTV Dhinakaran | ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతు లేఖపై వివాదం.. నకిలీ అంటూ టీవీకేపై దినకరన్ ఫిర్యాదు
TTV Dhinakaran | తమిళనాడు రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న విజయ్ నేతృత్వంలోని టీవీకేకు భంగపాట్లు ఎదురవుతున్నాయి. ఏఎంఎంకే ఎమ్మెల్యే తమకు మద్దతు ఇచ్చినట్లు టీవీకే వీడియో రిలీజ్ చేసింది. అయితే అది ఫోర్జరీ లేఖ అంటూ ఏఎంఎంకే పార్టీ ఫిర్యాదు చేసింది.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న విజయ్ నేతృత్వంలోని టీవీకేకు భంగపాట్లు ఎదురవుతున్నాయి. ఏఎంఎంకే ఎమ్మెల్యే తమకు మద్దతు ఇచ్చినట్లు టీవీకే వీడియో రిలీజ్ చేసింది. అయితే అది ఫోర్జరీ లేఖ అంటూ ఏఎంఎంకే పార్టీ ఫిర్యాదు చేసింది. (TTV Dhinakaran) టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) నుంచి ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ తమకు మద్దతు ఇచ్చినట్లు టీవీకే పేర్కొంది. లేఖపై ఆయన సంతకం చేస్తున్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆమోదంతోనే టీవీకేకు తాను మద్దతు ఇస్తున్నట్లు రామరాజ్ అందులో పేర్కొన్నారు. ఈ లేఖను గవర్నర్కు కూడా టీవీకే సమర్పించినట్లు సమాచారం.
కాగా, ఆ లేఖ నకిలీ అని, కామరాజ్ సంతకం చేస్తున్న వీడియోను ఏఐతో సృష్టించినట్లు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ ఆరోపించారు. టీవీకేకు తమ పార్టీ ఎలాంటి మద్దతు ప్రకటించలేదని మీడియాతో అన్నారు. తమ ఏకైక ఎమ్మెల్యే కనిపించడం లేదని, ఆయన కోసం టీవీకే బేరసారాలు చేస్తున్నదని ఆరోపించారు. మద్దతుకు సంబంధించిన ఫోర్జరీ లేఖ అంశంలో టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గిండి రేంజ్ ఏసీపీ కార్యాలయానికి దినకరన్ చేరుకుని టీవీకేపై ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్పై టీవీకే మండిపడింది. ఆయన అసత్య వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ మరో ట్విస్ట్ ఇచ్చారు. శనివారం తమ ఎకైక ఎమ్మెల్యే కామరాజ్తో కలిసి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ఆయన కలిశారు. ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కే పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే తమ ఏకైక ఎమ్మెల్యే కనిపించడం లేదని, రాజకీయ ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందన్న దినకరన్ ఆరోపణలకు ఆయన తాజా చర్య పూర్తి విరుద్ధంగా ఉన్నది.
#WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying “These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12
— ANI (@ANI) May 8, 2026
#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy Range
This comes amid Dhinakaran’s claim that TVK shared ‘forged copy’ of MLA Kamaraj’s letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8
— ANI (@ANI) May 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AMMK
- Files
- Forged
- MLA letter
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

