Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
machete stuck in Man’s head | వైరి వర్గంతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కొడవలితో దాడి జరిగింది. ఆ కొడవలి అతడి తలలో దిగింది. ఆ వ్యక్తి అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: వైరి వర్గంతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కొడవలితో దాడి జరిగింది. ఆ కొడవలి అతడి తలలో దిగింది. ఆ వ్యక్తి అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. (machete stuck in Man’s head) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మే 1న రాత్రి 11:45 గంటల సమయంలో మాంఖుర్డ్ ప్రాంతంలోని పీఎంజీపీ కాలనీలో రోహిత్ నాగనాథ్ పవార్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కొడవలితో దాడి చేయగా అతడి తలలో దిగింది.
కాగా, రోహిత్ వెంటనే తలలో దిగిన కొడవలితో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. తలలో కొడవలితో ఉన్న అతడ్ని చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేర సంఘటన నేపథ్యంలో రోహిత్‌కు వెంటనే చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది జాప్యం చేశారు.
మరోవైపు రోహిత్‌ను లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అతడి తలలో ఇరుక్కున్న కొడవలిని బయటకు తీసేందుకు అక్కడి డాక్టర్లు క్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. రోహిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నదని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే నిశిత వైద్య పర్యవేక్షణలో అతడు ఉన్నట్లు చెప్పారు.
కాగా, రోహిత్‌పై దాడి సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన ముగ్గురు మైనర్ బాలురను మే 2న అదుపులోకి తీసుకున్నారు. డోంగ్రీ రిమాండ్ హోమ్‌కు వారిని తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు తలలో దిగిన కొడవలితో రోహిత్ ఆసుపత్రి వద్దకు చేరుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A man walked into a Mumbai hospital with a machete lodged in his skull and spent several hours in the waiting room casually checking his phone. pic.twitter.com/xHnj8zUvyU
— ExtraOrdinary (@Extreo_) May 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

