jailer, murder convict Married | జైలు అధికారిణి, హత్య కేసు ఖైదీ మధ్య ప్రేమ.. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో మతాంతర వివాహం
jailer, murder convict Married | జైలు అధికారిణి, హత్య కేసులో జైలు శిక్ష పడిన ఖైదీ మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి జైలు శిక్ష ముగిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ (వీహచ్పీ) ఆధ్వర్యంలో వారిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు.
భోపాల్: జైలు అధికారిణి, హత్య కేసులో జైలు శిక్ష పడిన ఖైదీ మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి జైలు శిక్ష ముగిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ (వీహచ్పీ) ఆధ్వర్యంలో వారిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు. (jailer, murder convict Married) మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాండ్లా ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర సింగ్ 2007లో ఒక కౌన్సిలర్‌ను హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
కాగా, సత్నాలోని సెంట్రల్ జైలులో ధర్మేంద్ర సింగ్ జైలు శిక్ష అనుభవించాడు. ఈ సందర్భంగా వారెంట్ సంబంధిత పనుల్లో జైలు అధికారులకు సహాయం చేశాడు. ఈ నేపథ్యంలో వారెంట్ ఇన్చార్జ్గా పనిచేసిన జైలు అధికారిణి అయిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫిరోజా ఖతూన్, ఖైదీ ధర్మేంద్ర సింగ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమ సంబంధంగా మారింది.
మరోవైపు సుమారు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ధర్మేంద్ర సింగ్, సత్ప్రవర్తన కారణంగా నాలుగేళ్ల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో రిలేషన్లో ఉన్న జైలు అధికారిణి ఫిరోజా ఖతూన్, అతడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వీరిద్దరి మతాంతర వివాహాన్ని ఫిరోజా ముస్లిం కుటుంబం వ్యక్తిరేకించింది.
కాగా, మే 5న ఛతర్పూర్ జిల్లాలో ధర్మేంద్ర సింగ్, ఫిరోజా ఖతూన్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌బహదూర్ మిశ్రా, ఆయన భార్య కలిసి ‘కన్యాదానం’ నిర్వహించారు. బజరంగ్ దళ్ సభ్యులతోపాటు సత్నా సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది, కొందరు ఖైదీలు ఈ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read:
Father Kills Daughter | సవతి సోదరుడి మార్క్‌షీట్‌ను మార్పు చేసిన బాలిక.. హత్య చేసిన తండ్రి
Mirrors in Mysuru | బహిరంగ మూత్ర విసర్జన నివారణకు.. అధికారులు ఏం చేశారంటే?
Watch: మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

