ముంబై: సవతి సోదరుడి మార్క్‌షీట్‌ను ఒక బాలిక మార్పు చేసింది. ఇది తెలుసుకున్న ఆమె తండ్రి ఆగ్రహించాడు. చెక్క కోసే యంత్రంతో కుమార్తెను హత్య చేశాడు. ఆ బాలిక మృతదేహానికి నిప్పంటించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Father Kills Daughter) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేవుల్గావ్ రాజే గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక స్కూల్ పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆమె సవతి సోదరుడు ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడి మార్క్షీట్లోని మార్కులను ఆ బాలిక మార్చివేసింది.
కాగా, తండ్రి శాంతారామ్ దుర్యోధన్ చవాన్‌కు ఈ విషయం తెలిసింది. ఆగ్రహించిన అతడు చెక్క కోసే యంత్రంతో కుమార్తెను హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి నిప్పంటించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పాక్షికంగా కాలిన బాలిక మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రి శాంతారామ్ దుర్యోధన్ చవాన్, సవతి తల్లి చింకీ భోంస్లేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Mirrors in Mysuru | బహిరంగ మూత్ర విసర్జన నివారణకు.. అధికారులు ఏం చేశారంటే?
Vijay | మెజారిటీ మార్క్ కోసం విజయ్ ప్రయత్నాలు.. వీసీకే, సీపీఐ, సీపీఎం మద్దతు కోరిన టీవీకే