Watch: మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Cherian Philip | మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తిరువనంతపురం: మహిళా ఎమ్మెల్యేను బహిరంగంగా కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇబ్బందిపడటంతో పాటు ఆయనను తోసి ముందుకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Cherian Philip) కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరిగి అధికారం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం పార్టీ సమావేశం జరిగింది.
కాగా, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బిందు కృష్ణ, కీలక శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు కేపీసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆమె చేతులు జోడించి అక్కడున్న నేతలకు నమర్కించారు.
మరోవైపు అక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ అందరి ముందు అసభ్యకరంగా ప్రవర్తించారు. బిందు కృష్ణ వద్దకు వచ్చి ఆమెను కౌగిలించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో ఆమె కాస్త ఇబ్బందికి గురయ్యారు. చెరియన్ ఫిలిప్ను పక్కకు తోసి ముందుకు వెళ్లారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా సిబ్బంది సమక్షంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
A video from the Kerala Pradesh Congress Committee headquarters in Thiruvananthapuram has gone viral after Cherian Philip allegedly attempted to hug newly elected Kollam MLA Adv. Bindu Krishna despite her apparent reluctance during a legislative party meeting.
The viral video… pic.twitter.com/UhURpa80Qz
— Hate Detector 🔍 (@HateDetectors) May 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

