వరుసగా మూడోసారి.. నేడు బెంగాల్ సీఎంగా మమత ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం| పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్కడ్ ఇవాళ ఉదయం 10.45 గంటలకు దీదీతో ప్రమాణం చేయించనున్నారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధన్కడ్ ఇవాళ ఉదయం 10.45 గంటలకు దీదీతో ప్రమాణం చేయించనున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో.. కొద్దిమందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీదీతో పాటూ పలువురు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఎనిమిది విడతలుగా జరిగిన ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హ్యాట్రిక్ విజయంతో బెంగాల్లో మూడోసారి అధికారంలో వచ్చిన విషయం తెలిసిందే.
నిన్న కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని శాసనసభాపక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రోటెమ్ స్పీకర్‌గా సుబ్రతా ముఖర్జీ వ్యవహరించనున్నారు. కాగా, మమతా బెనర్జీ.. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారిపై ఓడిపోయారు. అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమె ఆరు నెలల లోపు ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. బీజీపీ, టీఎంసీ మధ్య హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 213 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి
కంగన ట్విట్టర్ ఖాతాపై వేటు
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూ
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

