కరోనా ఎఫెక్ట్.. ఏపీలో నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూ
కరోనా ఎఫెక్ట్| ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండంతో ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి పగటిపూట కర్ఫ్యూ కూడా అమలవుతుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండంతో ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి పగటిపూట కర్ఫ్యూ కూడా అమలవుతుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు రెండు వారాలపాటు అమల్లో ఉంటాయి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీళ్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఆర్టీసీ బస్సులూ బంద్
ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి రావడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వాహనాలను నిలిపివేయనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తిరిగే సుమారు 2500 వరకు బస్సులకు బ్రేకులు పడ్డాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కలిసి రోజూ 1400 నుంచి 1500 బస్సుల వరకు నడుపుతున్నాయి. మరో తొమ్మిది వందల వరకు ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. కర్ఫ్యూ నేపథ్యంలో ఇవన్నీ డిపోలకు, షెడ్లకు పరిమితం కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఢిల్లీ హాస్పిటల్లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ప్లాస్మా మాకివ్వరూ!
విదేశీ సాయం చీకటి కోణం
కంగన ట్విట్టర్ ఖాతాపై వేటు
పాజిటివిటీ10% దాటితే లాక్‌డౌనే మార్గం
16.69 కోట్ల డోసులు ఇచ్చాం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

