Headache | తలనొప్పి సమస్య అసలు ఎందుకు వస్తుంది.. ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి..?
తలనొప్పి చాలా మందిని తరచూ ఇబ్బంది పెట్టే సాధారణ ఆరోగ్య సమస్య. ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా తలనొప్పి రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంది. చాలామంది ఒక కప్పు కాఫీ తాగడం లేదా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా తలనొప్పి తగ్గిపోతుందని భావిస్తారు.
Headache | తలనొప్పి చాలా మందిని తరచూ ఇబ్బంది పెట్టే సాధారణ ఆరోగ్య సమస్య. ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా తలనొప్పి రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంది. చాలామంది ఒక కప్పు కాఫీ తాగడం లేదా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా తలనొప్పి తగ్గిపోతుందని భావిస్తారు. అయితే ప్రతిసారి అలా జరగదు. ఆయుర్వేదంలో తలనొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సహజమైన ఆహారాలు, ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం తలకు సున్నితంగా మసాజ్ చేయడం తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో నీటి కొరత (డీహైడ్రేషన్) వల్ల వచ్చే పిత్త సంబంధిత తలనొప్పుల్లో తరచూ నీరు లేదా ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం మంచిదని సూచిస్తోంది. అలాగే జలుబు, దగ్గు కారణంగా ముక్కు మూసుకుపోయి తలనొప్పి వస్తే, ఆయుర్వేద మూలికల నూనె లేదా నెయ్యిని ముక్కు రంధ్రాలలో వేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
బ్రాహ్మి, చందనం..
బ్రాహ్మి తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడే ముఖ్యమైన ఆయుర్వేద మూలికగా చెప్పవచ్చు. ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంతోపాటు ఒత్తిడి, మానసిక ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రాహ్మి నూనెతో తలకు మసాజ్ చేయడం లేదా బ్రాహ్మి, నెయ్యి చుక్కలను ముక్కులో వేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. చందనం కూడా తలనొప్పికి ఉపయోగించే సంప్రదాయ చికిత్సల్లో ఒకటి. అర టీస్పూన్ చందనం పొడిలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారుచేసి నుదుటిపై రాసి సుమారు 20 నిమిషాలు ఉంచితే చల్లదనాన్ని అందించి తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తగర్ అనే ఔషధ మూలికను కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ మూలికతో తయారైన ఔషధ నూనెతో మసాజ్ చేయడం లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.
చిన్న యాలకులు, రాక్ సాల్ట్..
చిన్న యాలకులను నమలడం కూడా కొన్ని రకాల తలనొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే సాధారణ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ వాడడం కొందరికి ప్రయోజనకరంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు రాక్ సాల్ట్ కలిపి తాగడం కూడా కొన్ని రకాల తలనొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం తలనొప్పిని వాత, పిత్త, కఫ అనే మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఏ రకమైన తలనొప్పో గుర్తిస్తే దానికి తగిన చికిత్సను ఎంచుకోవడం సులభమవుతుంది. వాత సంబంధిత తలనొప్పి సాధారణంగా తల వెనుక భాగంలో ప్రారంభమై ముందుభాగానికి వ్యాపిస్తుంది. మెడ, భుజాల్లో బిగుతు, మలబద్ధకం, వీపు నొప్పి వంటి సమస్యలు కూడా దీంతోపాటు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ముక్కు రంధ్రంలో మూడు నుంచి ఐదు చుక్కల గోరువెచ్చని నెయ్యి వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
నీటిని తగినంత తాగాలి..
శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవడం, ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ చక్కెర, అర టీస్పూన్ ఉప్పు కలిపి తాగడం, జాజికాయ పొడితో పేస్ట్ తయారుచేసి నుదుటిపై రాయడం కూడా ఉపయోగపడతాయి. పిత్త సంబంధిత తలనొప్పి సాధారణంగా కణతల వద్ద ప్రారంభమై తల మధ్య భాగానికి వ్యాపిస్తుంది. ఎండలో ఎక్కువసేపు ఉండడం లేదా ఎక్కువ కారం ఉన్న ఆహారం తినడం వల్ల ఈ నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రోజుకు మూడు సార్లు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే చందనం పేస్ట్‌ను తలకు రాయడం, జీలకర్ర, ధనియాలతో తయారు చేసిన టీ తాగడం కూడా పిత్త సంబంధిత తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

