ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 07:03:45

మన దళాలు సర్వం సిద్ధం: రావత్‌

మన దళాలు సర్వం సిద్ధం: రావత్‌

న్యూఢిల్లీ: తూర్పు లఢ‌క్‌‌లోని వాస్త‌వా‌ధీన రేఖ (ఎ‌ల్‌‌ఏసీ) వెంబడి తలెత్తే ఎలాంటి ఉద్రిక్త పరి‌స్థి‌తు‌ల‌నైనా సమ‌ర్థ‌వం‌తంగా ఎదు‌ర్కొ‌నేం‌దుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నా‌యని రక్షణ దళాల అధి‌పతి (సీ‌డీ‌ఎస్‌) జన‌రల్‌ బిపిన్‌ రావత్‌ తెలి‌పారు. ఈ మేరకు సైన్యం‌లోని ఉన్న‌త‌స్థాయి కమాం‌డ‌ర్లతో కలిసి పార్ల‌మెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీ‌ఏ‌సీ)కి వివ‌రాలు వెల్ల‌డిం‌చారు. రానున్న శీతా‌కా‌లంలో కూడా సరి‌హ‌ద్దుల్లో భద్రతా చర్య‌లను పటిష్ఠం చేసేం‌దుకు సైన్యం సిద్ధంగా ఉన్న‌దని కమి‌టీకి రావత్‌ వివ‌రిం‌చి‌నట్టు కమిటీ వర్గాలు తెలి‌పాయి. 

logo