బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్‌కు బాలీవుడ్లోనే కాదు సౌత్‌లోను ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని భాషలలో ఒక్కో సినిమా చేసిన సన్నీ తాజాగా మరో సౌత్ సినిమాకు సైన్ చేసింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందబోతున్న సినిమాలో సన్నీలియోన్ కు రాణి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను వెయ్యి ఏళ్ల క్రితం కథతో రూపొందించనున్నారట. చెన్నై మరియు ముంబయిల్లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్టింగ్ లను నిర్మించి అందులో షూటింగ్ జరపనున్నట్టు సమాచారం.
సింధనై సీ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న యువన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా, ఈ చిత్రాన్ని శక్తి మరియు శశికుమార్ లు నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం సన్నీ లియోన్ కేరళలో ఒక మలయాళం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత హిందీలో ఒక సినిమాలో నటించబోతుంది.