‘ఖిలాడీ’ డేట్‌ చెప్పలేదు ఏంటమ్మా ?

287
‘ఖిలాడీ’ డేట్‌ చెప్పలేదు ఏంటమ్మా ?

టాలీవుడ్‌ మాస్‌ రాజా రవితేజ ఈ శ్రీరామనవమికి తన అభిమానులకు , సినీ ప్రేక్షకులకు శుభాకాంక్షలుచెప్పేశాడు. ఖిలాడీగా వచ్చి అందిరికీ నవమి శుభాకాంక్షలు తెలిపాడు. రమేష్‌ వర్మ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా దరిదాపు షూటింగ్‌ ని పూర్తి చేసుకుంది.

డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈసినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. పెన్‌ మూవీస్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఖిలాడీ మూవీ మే 28న విడుదలవుతుందని ఇంతకుముందు ప్రకటించారు. అయితే ఇప్పుడు నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ లో మాత్రం రిలీజ్‌ డేట్‌ చెప్పకపోవడం సినీజనాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.