e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News తృణమూల్ ప‌ద్మ‌వ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!

తృణమూల్ ప‌ద్మ‌వ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!

తృణమూల్ ప‌ద్మ‌వ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ హ్యాట్రిక్ విజ‌యం.. ప‌లు ఫిరాయింపుదార్ల‌ ఈక్వేష‌న్ల‌ను తిర‌గేసింది. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ సార‌ధ్యంలోని టీఎంసీని ఓడించ‌డానికి ఆ పార్టీ నేత‌ల నుంచి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. ఇదే అస్త్రాన్ని బీజేపీలో చేరిన మాజీ నేత‌ల‌పై దీదీ పార్టీ ప్ర‌యోగిస్తున్న‌ది.

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి మూడు వారాల్లోపే రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది. ఈ ప‌రిస్థితుల్లో త‌న పార్టీలోకి చేరిన వారిని కాపాడుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

అవ‌మాన‌క‌ర రీతిలో ఓట‌మి పాలైన బీజేపీ.. పార్టీ శ్రేణుల‌పై హింస‌, దాడుల సాకు పేరుతో త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌కు సెంట్ర‌ల్ సెక్యూరిటీ క‌ల్పించింది. అయితే, కొంద‌రు బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర భ‌ద్ర‌త‌ను ఆమోదించేందుకు నిరాక‌రిస్తున్నారు. అందుకు లాజిస్టిక్స్ అంశాలు సాకుగా చూపుతున్నారు.

సిలిగిరి నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే శంక‌ర్ ఘోష్ మాట్లాడుతూ.. నాకు కేంద్ర భ‌ద్ర‌త అవ‌స‌రం లేదు. నేను పుట్టి పెరిగిన సిటీలో ఏ ముప్పూ లేద‌న్నారు. రోజూ టూ వీల‌ర్‌పైనే తిరుగుతాన‌ని, అటువంట‌ప్పుడు సెంట్ర‌ల్ సెక్యూరిటీ అవ‌స‌రమే లేద‌న్నారు.

బీజేపీ ఎమ్మెల్యేలు ఆనంద‌మ‌యి బ‌ర్మ‌న్‌, చంద‌నా బౌరి కూడా త‌మ‌కు కేంద్ర భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. నిఘా కింద బ‌త‌క‌డానికి సిద్ధంగా లేనందునే బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర భ‌ద్ర‌త‌ను నిరాక‌రిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన కొన్ని రోజుల్లో రాష్ట్ర రాజ‌కీయాలే మారిపోయాయి. ఫ‌లితాలు వ‌చ్చిన 48 గంట‌ల్లోపు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారంద‌రికీ త‌లుపులు తెరిచే ఉన్నాయ‌ని సంకేతాలిచ్చారు.

ఒక‌ప్పుడు దీదీకి అత్యంత స‌న్నిహితుడిగా ఉంటూ.. బీజేపీలో చేరిన సువేందు అధికారిని విప‌క్ష నేత‌గా ప్ర‌క‌టించ‌డంలో విజ‌యం సాధించింది. ముకుల్ రాయ్ వంటి సీనియ‌ర్ల‌కు ఎలా స‌ర్దుబాటు చేయాల‌న్న విష‌య‌మై క‌మ‌ల‌నాధుల‌కు క్లిష్టంగా మారింది. నాటి నుంచి ముకుల్ రాయ్ అనుమాన‌స్ప‌దంగా బీజేపీ స‌మావేశాల‌కు దూరంగా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించ‌డానికి బీజేపీ సైనికుడిగా త‌న క్రుషి కొన‌సాగుతుంద‌ని ముకుల్ రాయ్ ఈ నెల 8వ తేదీన ట్వీట్ చేశారు. త‌న రాజ‌కీయ మార్గానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌న్నారు.

వ‌చ్చే కొన్ని వారాల్లో రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డ్డారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన టీఎంసీ మాజీ నేత‌లు ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

మాజీ మంత్రి రాజీవ్ బెన‌ర్జీ, మాజీ ఎమ్మెల్యేలు ప్ర‌బీర్ ఘోషాల్‌, వైశాలీ దాల్మియా ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నారు. మార్చి 8వ తేదీన టిక్కెట్ నిరాక‌ర‌ణ‌తో మాజీ ఎమ్మెల్యే సొనాలీ గుహా బీజేపీలో చేరారు. కానీ తాజాగా ఈ నెల 22వ తేదీన త‌న‌ను క్ష‌మించాల‌ని దీదీని కోరారు. పార్టీలో తిరిగి చేరేందుకు అనుమ‌తించాల‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ధృతరాష్ట్రునిలా వ్య‌వ‌హ‌రిస్తున్న సోనియా : శివ‌రాజ్ చౌహాన్

క‌రోనా వ్యాక్సినేష‌న్‌.. న‌దిలో దూకిన ప్ర‌జ‌లు

తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు

డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

రాజస్థాన్‌లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్‌ వేవేనా?

కరోనా కల్లోలంలో ద‌ర్శ‌నాలేమిటి మంత్రిగారూ..

ముంచుకొస్తున్న ‘యాస్‌’ ముప్పు

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న‌.. సోద‌రుడి పెళ్లిలో త‌హ‌సీల్దార్ డ్యాన్స్..

చార్జీ పడుద్ది బాసూ..

మాస్క్ లేకుండానే.. బైక్ ర్యాలీలో పాల్గొన్న బ్రెజిల్ అధ్య‌క్షుడు

వ్య‌క్తిగ‌తంగా కోర్టుకు హాజ‌రైన ఆంగ్ సాన్ సూకీ

జర ఇవి చూస్కో

విదేశాల్లో కొవాగ్జిన్ ఉత్ప‌త్తిపై ఫోక‌స్‌! ఎలాగంటే!!

పీఎఫ్‌తో లాభాలెన్నో

లాక్‌డౌన్‌తో నిత్యావ‌స‌రాలు కుదేలు.. ఉత్ప‌త్తి త‌గ్గించిన ఎఫ్ఎంసీజీ సంస్థ‌లు

ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తృణమూల్ ప‌ద్మ‌వ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!

ట్రెండింగ్‌

Advertisement