ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - May 07, 2020 , 13:57:01

టెలీ ఆయుర్వేదాన్ని తీసుకువ‌చ్చారు...

టెలీ ఆయుర్వేదాన్ని తీసుకువ‌చ్చారు...

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ వ్యాప్తంగా, మ‌న దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంపై దృష్టి సారించారు. క‌రోనాను త‌ట్టుకోవ‌డానికి, నివార‌ణ కోసం ఆయుర్వేదాన్ని అనుస‌రిస్తున్నారు. టెక్నాల‌జీని వినియోగించుకొని 50 వేల మంది ఆయుర్వేద వైద్యుల‌తో కూడిన ప్లాట్‌ఫార‌మ్‌ నిరోగ్‌స్ట్రీట్ ప్ర‌జ‌ల‌కు టెలియుర్వేదం ద్వారా ఆన్‌లైన్‌లో ఆరోగ్య స‌ల‌హాలు ఇస్తుంది. నిరోగ్‌స్ట్రీట్ వ్య‌వస్థాప‌కుడు రామ్ ఎన్‌కుమార్ మాట్లాడుతూ...లాక్‌డౌన్ మ‌ధ్య మా ప్లాట్‌ఫాం ద్వారా 50,000 మంది ఆయుర్వేర వైద్యుల‌తో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల మ‌ధ్య విజ‌య‌వంతంగా అనుసంధానం ఏర్పాటుచేశాం. ప్ర‌జలు లాక్‌డౌన్‌ను గౌర‌విస్తూ వారి ఆరోగ్య అవ‌స‌రాల కోసం ఆన్‌లైన్‌లో వైద్యుల‌ను సంప్ర‌దించ‌డానికి మొగ్గుచూపుతున్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల సాంకేతిక అవ‌స‌రాలు తీర్చ‌డానికి ఆయుర్వేదాన్ని టెక్నాల‌జీతో అనుసంధానం చేశాం.

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డానికి క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిబంధ‌న‌లు అనుస‌రించి మందులు కూడా స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. మా నెట్‌వ‌ర్క్ ద్వారా ఆయుర్వేద వైద్యుల‌కు శానిటైజ‌ర్లు, మాస్క్‌లు పంపిణీ చేశాం. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని అధిగ‌మించ‌డానికి ఆయుర్వేద వైద్యులు, రోగుల‌తో అనుసంధానం చేయ‌డానికి టెలీఆయుర్వేరం మంచి ఆలోచ‌న‌. రోగ‌నిరోద‌క శ‌క్తిని పెంచే ఆయుర్వేద ఉత్ప‌త్తుల కోసం ఆన్‌లైన్‌లో స‌ర్చింగ్ 6శాతం పెరిగింది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే మందులు, ములికా స‌బ్బులు, శానిటైజ‌ర్లు మొద‌టైన వాటికి డిమాండ్ పెరిగింది. రాబోయేరెండేళ్ల‌లో ల‌క్ష మందికి స్వ‌చ్ఛ‌మైన ఆయుర్వేద వైద్య శిక్ష‌ణ ఇవ్వ‌డం, వారికి దృవ‌ప‌త్రాలు అందించ‌డం, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి ఆయుర్వేద వైద్యం తీసుకురావ‌డం మా వేదిక ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.   ‌


logo