పాపం పవర్ స్టార్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదట!
పవర్ స్టార్ | మన వాళ్ల దృష్టి మొత్తం మన పవర్ స్టార్ వకీల్ సాబ్ పైనే ఉంది. ఈ టైంలో టాలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న పునీత్ రాజ్ కుమార్‌కు ఎదురుదెబ్బ ఉండదు.

ఎంతమాట ఎంతమాట.. పవర్ స్టార్‌ను పట్టించుకోక పోవడమా.. అసలు జరుగుతుందా అది.. ఓ వైపు ఆయన సినిమా ట్రైలర్ విడుదల యూట్యూబ్‌ను షేక్ చేస్తుంటే.. ఆయన సినిమాలు పట్టించుకోవడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని కోప్పడతారా ఏంటి..? అయితే అక్కడే మీ ఊహలకు బ్రేకులు వేయండి. మనం మాట్లాడుకుంటున్నది తెలుగు పవర్ స్టార్ గురించి కాదు కన్నడ పవర్ స్టార్ గురించి. ఆయన పేరు పునీత్ రాజ్ కుమార్. కర్ణాటకలో ఈ పేరు వింటే అభిమానుల్లో కరెంటు పాస్ అవుతుంది. అందుకే ఆయనకు ముందుగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నారు వాళ్లు.

హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న సౌత్ హీరోల్లో అందరికంటే ముందుంటాడు పునీత్. ఈయన ప్రస్తుతం యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలవుతుంది. కర్ణాటకలో మునుపెన్నడూ లేని విధంగా విడుదలకు సిద్ధమైంది యువరత్న సినిమా. కేజిఎఫ్ లాంటి సంచలన సినిమాను నిర్మించిన హోంబలే క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. తెలుగులో కూడా ఏప్రిల్ 1న యువరత్న సినిమాను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమాపై ఇక్కడ పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. కనీసం పవర్ స్టార్ సినిమా వస్తున్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు.

ప్రస్తుతం మన వాళ్ల దృష్టి మొత్తం మన పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపైనే ఉంది. ఇలాంటి సమయంలో తెలుగులో ఏదో మాయ చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న పునీత్ రాజ్ కుమార్‌కు ఇంతకంటే ఎదురుదెబ్బ మరొకటి ఉండదు. విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సాయి కుమార్ లాంటి సీనియర్ నటులు నటించారు. అఖిల్ హీరోయిన్ సయేషా సైగల్ ఇందులో పునీత్ తో జోడీ కట్టింది. మొత్తానికి మరి చూడాలి తెలుగులో కన్నడ పవర్ స్టార్ ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతాడో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నివేదా పేతురాజ్ నో కిస్ పాలసీ..!
రంగ్ దే జోరుకు బ్రేకులు.. నితిన్‌కు ఇక కష్టమే
ప్రియాంక మోహన్ : రెండు ఫ్లాపులిచ్చినా.. ఆ హీరోయిన్ వెంటే పడుతున్నారు
లాహే లాహే లిరికల్ వీడియో..చిరు స్టైలిష్ డ్యాన్స్
నవీన్ కోసం స్లిమ్ కానంటున్న అనుష్క..!
దిల్ రాజు ఈజ్ బ్యాక్.. ఏం కాంబినేషన్స్ సామీ..!
పవన్ మూవీ సెట్స్ లో ప్రమాదం..ఆదిత్యమీనన్‌కు గాయాలు..!
రష్మికకు నాగార్జున ఛాలెంజ్.. వీడియో వైరల్
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
స్కై బ్లూ డ్రెస్ లో కట్టిపడేస్తున్న సారా..ఫొటోలు వైరల్
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్‌కు అనుమతి నిరాకరణ
అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెట్
వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ దెబ్బకు రికార్డులు షేక్
సీక్రెట్ డ్రింక్ షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

