e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..

వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..

వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..

వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ | పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి దాదాపు ఏడేళ్లు అయిపోయింది. అప్పుడెప్పుడో అత్తారింటికి దారేది తర్వాత ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలేవీ కూడా పాజిటివ్ టాక్ దక్కించుకోలేదు. సోసో టాక్ తోనే రచ్చ చేశాడు పవర్ స్టార్. అలాంటిది ఈయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుంది..? ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఆ విష‌యం అర్థమవుతుంది. తొలి వీకెండ్ వకీల్ సాబ్ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల షేర్ చేరువగా వచ్చింది వకీల్ సాబ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్, అన‌న్య‌ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్ కాస్త యావరేజ్‌గా ఉన్నా సెకండాఫ్ సినిమాను నిలబెట్టింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుండటంతో వకీల్ సాబ్ రచ్చ చేస్తున్నాడు. వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏరియా వైజ్ లెక్కలు ఇప్పుడు చూద్దాం..

నైజాం- 16 కోట్లు
సీడెడ్- 8.25 కోట్లు
ఉత్తరాంధ్ర- 7.70 కోట్లు
ఈస్ట్- 4.30 కోట్లు
వెస్ట్- 5.70 కోట్లు
గుంటూరు- 4.85 కోట్లు
కృష్ణా- 3.25 కోట్లు
నెల్లూరు- 2.40 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 52.45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 2.40 కోట్లు
ఓవర్సీస్- 3.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 58.24 కోట్లు షేర్

వకీల్ సాబ్ సినిమా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.90 కోట్లు షేర్ వసూలు చేయాలి. ఇప్పటికే రూ.58 కోట్ల షేర్ వసూలు చేసింది వకీల్ సాబ్. అంటే మరో రూ.32 కోట్లు రావాలన్నమాట. ఉగాది సెలవులు ఉండటంతో అది అసలు విషయమే కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ చిత్ర దూకుడు తగ్గడం లేదు. కోవిడ్ సమయంలో కూడా ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం అయిపోతుంది. నాలుగో రోజు కూడా వకీల్ సాబ్ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కచ్చితంగా రూ.100 కోట్ల షేర్ ఈ చిత్రం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

వకీల్ సాబ్ ఆడుతున్న‌ థియేటర్లు సీజ్

జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టేశాడు..!

క‌రోనా పాజిటివ్.. థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన హీరోయిన్

గుడ్ న్యూస్ చెప్పిన యాంక‌ర్ స‌మీరా షరీఫ్

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఖిలాడి టీజ‌ర్

కేటీఆర్‌ సర్‌.. మీరు బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల్లో ప్ర‌యత్నించ‌లేదా?

16 ఏళ్ల త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నున్న లెజండ‌రీ స్టార్స్

హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్

రామ్‌చరణ్‌ చిత్రంలో సల్మాన్‌?

ప‌వ‌ర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువర‌త్న

దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!

అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది

చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్

టాలీవుడ్‌కు క‌ష్ట‌మే : తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ థియేట‌ర్ల బంద్ ?‌

వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..

ట్రెండింగ్‌

Advertisement