Family Star | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay devarakonda), మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఈ సినిమాకు గీతా గొవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కథ రోటీన్‌గా ఉండడం, కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 26 నుంచి తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
VijayDeverakonda’s #FamilyStar to premiere on Amazon Prime from this Friday in Tamil & Telugu 📺 pic.twitter.com/Pe4VEyTK5E
— AmuthaBharathi (@CinemaWithAB) April 24, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోవర్థన్ (విజయ్ దేవరకొండ)ది మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ల పిల్లలు, నాన్నమ్మ.. ఇలా అందరి భాద్యత తనదే. తను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ మ్యానేజర్. తన జీతంతోనే ఇల్లు గడుస్తుంది. ప్రతి పైసా జాగ్రత్త ఖర్చుపెడతాడు. గోవర్థన్ పెంట్ హోస్‌లోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు వస్తుంది. తను మెల్లగా ఆ కుటుంబంతో కలిసిపోతుంది. గోవర్థన్ ని ఇష్టపడుతుంది. గోవర్ధన్ కూడా తన మనసులో మాట చెప్పే సమయంలో ఇందు గురించి ఓ నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? అసలు ఇందు ఎవరు? గోవర్థన్ ఇంటికి ఎందుకు వచ్చింది ? ఇందు గురించి నిజం తెలుసున్న గోవర్ధన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? ఇదంతా తెరపై చూడాలి