Dagdu Sakpal : మహారాష్ట్ర (Maharastra) లోని లోకల్ బాడీస్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కూడా మొదలుకానుంది. ఇలాంటి తరుణంలో ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన (Shivsena UBT) కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దగ్డు సక్పాల్ (Dagdu Sakpal) ఉద్ధవ్ శివసేనకు రాజీనామా చేశారు.
వెంటనే ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండే సమక్షంలో ఈ చేరిక జరిగింది. షిండే స్వయంగా కండువా కప్పి దగ్డు సక్పాల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఏక్నాథ్ సమక్షంలో దగ్డు సక్పాల్ ఏక్నాథ్ వర్గం శివసేనలో చేరిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Maharashtra: Former Shiv Sena MLA Dagdu Sakpal leaves Shiv Sena (UBT) and joins Deputy CM Eknath Shinde-led Shiv Sena.
(Video: Shiv Sena) pic.twitter.com/MQEyXwSg6G
— ANI (@ANI) January 11, 2026