Baby John Movie | బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం బేబీజాన్(Baby John). ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh), వామిక గబ్బి కథనాయికలుగా నటిస్తుండగా.. కోలీవుడ్ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను జవాన్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే.. బుధవారం వరుణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా మూవీ టీమ్ విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరిచిపోలేని సరికొత్త అనుభవాన్ని అందించేందుకు మీ ముందుకు ‘బేబీ జాన్’ త్వరలో వస్తున్నాడు అని చిత్రయూనిట్ రాసుకోచ్చింది.
ఇక ఈ సినిమాను మే 31 2024 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనుండగా.. సినీ1స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియఅట్లీ (అట్లీ సతీమణి) సంయుక్తంగా నిర్మిస్తుంది.