అయ్యో ఎంత పనైపోయింది.. అక్కడికి రూట్స్ బంద్ చేసారు.. మా దగ్గరికి ఎవరూ రావద్దంటూ ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలిసిన తర్వాత సినిమా వాళ్లు అయ్యయ్యో అనుకుంటున్నారు. అంతగా బాధ పడేంతగా ఎక్కడికి బంద్ చేసారు అనుకుంటున్నారా..? ఇంకెక్కడికి మనోళ్లకు ఏ సంతోషం వచ్చినా కూడా ముందుగా వెళ్లే ప్లేస్ ఒక్కటే కదా.. అదే మాల్దీవ్స్. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి లేదు. కరోనా కారణంగా మాల్దీవ్స్ కు ప్రవేశం లేదంటూ మాల్దీవ్స్ లో అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అంతా అక్కడికే వెళ్తుంటారు.
ఆ దేశంలోని సముద్రం దగ్గర అదిరిపోయే పోజులు ఇస్తుంటారు. అక్కడే రోజుల పాటు ఎంజాయ్ చేస్తుంటారు. ఏ హీరో హీరోయిన్ ఇన్ స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేసినా కూడా మాల్దీవ్స్ అందాలే కనిపిస్తుంటాయి. ప్రతీ ఒక్కరు అక్కడికి వెళ్లి సేద తీరుతుంటారు. ముఖ్యంగా మాల్దీవ్స్ లోనే తమ పెళ్లి రోజు, పుట్టినరోజులు చేసుకుంటుంటారు మన సెలబ్రిటీస్. ఈ పర్యటనలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. పైగా ప్రమోషనల్ టూర్ కూడా కావడంతో అక్కడికే పరుగులు తీస్తున్నారు. బన్నీ పెళ్లి రోజు అక్కడే జరిగింది.. నిహారిక, కాజల్ హనీమూన్ కూడా అక్కడే చేసుకున్నారు. తమ భర్తలతో కలిసి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసొచ్చారు.
కానీ ఇప్పుడు కరోనా మరీ పెరిగిపోతుండటంతో పర్యాటకుల రాకపై తాత్కాలిక నిషేధం విధించింది ఆ దేశం. ఈ మేరకు మాల్దీవుల పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ నిషేధం ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిషేధంతో ఒక్కసారిగా మన స్టార్స్ కు షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే షూటింగ్స్ లేకపోతే అక్కడికి వెళ్లిపోయే వాళ్లకు ఇప్పుడు నిజంగానే షాక్ ఇచ్చే విషయం ఇది. అయ్యో ఇప్పట్నుంచి బికినీ ఫోటోలు చూడలేమా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా బాగానే వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆచార్య రిలీజ్ పై కొరటాల క్లారిటీ..!
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…