Madhyapradesh | నార్వార్ కోటలో భారీ చోరీ.. మూడు వేల కిలోల ఫిరంగి మాయం
Madhyapradesh | మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని శివ్‌పురి జిల్లా (Shivpuri district) లో అత్యంత సాహసోపేతమైన రీతిలో భారీచోరీ జరిగింది. సింధియా రాజవంశం కాలంనాటి చారిత్రక నార్వార్ కోట (Narwar Fort) నుంచి సుమారు 3,000 కిలోల బరువున్న భారీ ఫిరంగిని దుండగులు అపహరించారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని శివ్‌పురి జిల్లా (Shivpuri district) లో అత్యంత సాహసోపేతమైన రీతిలో భారీచోరీ జరిగింది. సింధియా రాజవంశం కాలంనాటి చారిత్రక నార్వార్ కోట (Narwar Fort) నుంచి సుమారు 3,000 కిలోల బరువున్న భారీ ఫిరంగిని దుండగులు అపహరించారు. ఈ భారీ దోపిడీ కోసం నిందితులు క్రేన్, ట్రక్కును ఉపయోగించడం స్థానికంగా కలకలం రేపుతోంది. క్రేన్ సహాయంతో ఫిరంగిని ట్రక్కులోకి ఎక్కించి వారు అక్కడి నుంచి పరారయ్యారు.
జూలై 15న అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 25 నుంచి 30 మంది సాయుధులు కోట వెనుక మార్గం ద్వారా లోపలికి ప్రవేశించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు బాల్కిషన్ను తుపాకీతో బెదిరించి, ప్రతిఘటించవద్దని హెచ్చరించారు. తన వద్ద కేవలం కర్ర మాత్రమే ఉందని, దుండగులు అత్యాధునిక ఆయుధాలతో వచ్చారని, కనీసం టార్చ్‌లైట్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అక్కడ లేవని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు.
కోటలోని కచేరి ప్రాంగణంలో మొత్తం 14 ఫిరంగులు ఉండగా, వాటిలో అత్యంత విలువైన ఒక ఫిరంగిని దుండగులు ఎత్తుకెళ్లారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఫిరంగికి సింధియా కాలంలో సైనికపరంగా విశేష ప్రాముఖ్యత ఉండేది. దీనిపై ఉన్న అద్భుతమైన కళాకృతులు, గుర్తులు ఆ ఫిరంగికి ఉన్న చారిత్రక విలువను చాటిచెబుతాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కరేరా ఎస్డీపీఓ ప్రశాంత్ శర్మ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.
పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ తరుణ్ కుమార్ మహోబియా ఈ చోరీని తీవ్రంగా పరిగణించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కోటను సందర్శించనున్నట్లు వెల్లడించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దోపిడీ వెనుక అంతర్జాతీయ పురావస్తు స్మగ్లింగ్ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

