గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి : ఎమ్మెల్యే కూనంనేని
గ్రామాలు, బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్, ఎన్కే నగర్ గ్రామాల్లో రూ.79.50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు...
– రూ.79.50 లక్షల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చుంచుపల్లి, నవంబర్ 21 : గ్రామాలు, బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్, ఎన్కే నగర్ గ్రామాల్లో రూ.79.50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాబు క్యాంప్‌లో రూ.43 లక్షలతో 8 సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, రూ.10 లక్షలతో వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే మినీ వాటర్ స్కీమ్, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ పనులను ప్రారంభించారు. గ్రామాల్లో తాగునీరు, రహదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని, మహిళా సంఘాల బలోపేతానికి, పేదల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డీపీఓ బి.అనూష, ఎంపీడీఓ శుభాషిణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి : ఎమ్మెల్యే కూనంనేని
ఆపదలో ఉన్న కుటుంబాలకు బీమా రక్ష
ఆపద సమయంలో పేద కుటుంబాలకు జీవిత బీమా పథకం ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. శనివారం చుంచుపల్లి మండలం బాబు క్యాంప్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమన్నారు. అర్హులందరూ పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, నమోదు ప్రక్రియను వేగవంతం చేసి పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి : ఎమ్మెల్యే కూనంనేని
రుద్రంపూర్‌కు పిన్‌కోడ్ సమస్య
‘రేషన్ బియ్యంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర మంత్రులు’
ACB Raid | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

