రేపటి నుండి గుర్రంపోడులో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు
నల్లగొండ జిల్లా గుర్రంపోడులో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 11వ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గుర్రపోడు పట్టణం జెండాలు, తోరణాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు కానున్నారు.
– ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
గుర్రంపోడు, జూలై 18 : నల్లగొండ జిల్లా గుర్రంపోడులో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 11వ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గుర్రపోడు పట్టణం జెండాలు, తోరణాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు కానున్నారు. మహాసభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్ రావు పాల్గొననున్నారు. జిల్లాలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాల్ని ఈ మహాసభలో రూపొందించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు.
కార్మిక వ్యతిరేక విధానాల అవలంభిస్తున్న పాలకులపై పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్.రామస్వామి, మండల గౌరవ అధ్యక్షుడు రేపాక లక్ష్మీపతి, మండల అధ్యక్షుడు ఎస్కే అమీర్, కార్యదర్శి జాల పేద నరసింహ, ఉపాధ్యక్షులు చిన నరసింహ, పి.లింగయ్య, ఏ.మల్లయ్య, ఖలీల్, శ్రీను, జానీ, ఈదయ్య, షఫీ, లక్ష్మయ్య, మహమ్మద్. ఎస్కే ఖాసీం. లాలయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- AITUC
- Gurrampodu
- Nalgonda News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

