Watch: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న టీవీకే నేత.. వీడియో వైరల్‌తో పార్టీ నుంచి బహిష్కరణ
TVK Leader Bribe | తమిళనాడులోని అధికార టీవీకే నేత పెండింగ్ బిల్లుల క్లియర్ కోసం ఒక కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు ఆయన తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నేతను టీవీకే బహిష్కరించింది.
చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకే నేత పెండింగ్ బిల్లుల క్లియర్ కోసం ఒక కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు ఆయన తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నేతను టీవీకే బహిష్కరించింది. (TVK Leader Bribe) చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాంబాక్కం పంచాయతీలో సుమారు రూ. 9.80 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని నవీన్ అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. నిర్మాణ పని పూర్తయిన తర్వాత ఆ బిల్లులు క్లియర్ కాలేదు.
కాగా, మాంబాక్కం పంచాయతీ టీవీకే అధ్యక్షుడు, చెంగల్పట్టు తూర్పు జిల్లా జాయింట్ సెక్రటరీ ఎన్. వీర అలియాస్ వీరసామిని కాంట్రాక్టర్ నవీన్ సంప్రదించారు. ఆయనను తన కార్యాలయానికి పిలిపించిన వీరసామి, బిల్లులు క్లియర్ చేయడానికి తొలుత లక్ష లంచాన్ని డిమాండ్ చేశారు. రూ.75,000కు ఒప్పందం కుదరడంతో కాంట్రాక్టర్ నవీన్ మరునాడు గూగుల్ పే ద్వారా రూ. 50,000 ట్రాన్స్ఫర్ చేశారు.
మరోవైపు మిగిలిన లంచం డబ్బు చెల్లించేందుకు వీరసామిని ఆ కాంట్రాక్టర్ కలిశారు. అయితే రూ.2 లక్షలకు లంచం పెంచడంతో చివరకు రూ. 1.30 లక్షలకు మరో ఒప్పందం కుదిరింది. ఆ మొత్తం చెల్లించేందుకు కాంట్రాక్టర్ నవీన్ ఒప్పుకోవడంతో పంచాయతీ క్లర్క్‌కు వీరసామి ఫోన్ చేశారు. నవీన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నవీన్ గూగుల్ పే ద్వారా మరో రూ. 50,000 బదిలీ చేశాడు. మిగిలిన రూ. 30,000 వీరసామి కార్యాలయంలో నగదు రూపంలో అందజేశారు.
ఈ నేపథ్యంలో టీవీకే నేత వీరసామి ఆ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ కాంట్రాక్టర్ డీఎంకే మద్దతుదారుడని టీవీకే నేత వీరస్వామి ఆరోపించారు. ఆయన తన వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ వీరసామి లంచం తీసుకున్నట్లుగా ఉన్న ఆరోపిత వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో టీవీకే స్పందించింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
மாம்பாக்கம் த.வெ.க ஊராட்சி மன்ற தலைவரும், த.வெ.க செங்கல்பட்டு கிழக்கு மாவட்ட இணை செயலாளருமான வீரா என்பவர் ஒப்பந்ததாரரிடம் ரூ.1.30 லட்சம் லஞ்சம் வாங்கியதாக வீடியோ வைரல்..#TVK | #Chengalpattu | #Bribe | #PolimerNews pic.twitter.com/O0IhQ0cYt0
— Polimer News (@polimernews) July 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bribe
- Expelled
- Party
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

