ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలో నటనతోనే కాకుండా డ్యాన్స్‌తోను ఎంతగా ఆకట్టుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ‘సీటీమార్..’ పాటకు బన్నీ వేసిన స్టెప్స్ అభిమానులకు పూనకం వచ్చేలా చేశాయి. పాట కూడా సంగీతప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న ‘రాధే’ కోసం దేవిశ్రీప్రసాద్ రీమిక్స్ చేశారు. కొద్ది సేపటి క్రితం హిందీ పాట విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్లో నర్తించారు. ‘డీజే’లోని ‘సీటీమార్..’ పాట నచ్చడంతో తన సినిమా కోసం ఈ పాటను స్వరపరచమని సల్మాన్‌ఖాన్ స్వయంగా దేవిశ్రీప్రసాద్‌ను అడిగినట్లు తెలిసింది. ‘రాధే’ సినిమాకు ఈ
ఇక సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాంగ్‌లో మీ పర్ఫార్మెన్స్ ఎంతగానో నచ్చింది. డ్యాన్స్, స్టైల్ అదిరిపోయాయి. మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండండి.లవ్ యూ బ్రదర్ అని సల్మాన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక సల్మాన్ ట్వీట్‌కు స్పందించిన అల్లు అర్జున్.. మీ నుండి కాంప్లిమెంట్ అందుకున్నందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్యూ సల్మాన్ గారు. రాధే స్క్రీన్స్పైన మ్యాజిక్ చేసి అభిమానులకు మీకు సీటీమార్ వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. దిశా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్ తదితరులు నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రాన్ని రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Thank you soo much Salman garu . It’s a pleasure to receive a compliment from you . It’s such a sweet gesture. Looking forward for the RADHE magic on screens with fans doing SEETI MAAR for you . Thank you for your love . 🖤AA
— Allu Arjun (@alluarjun) April 26, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

